Salaries Hiked : ప్రభుత్వం శుభవార్త.. వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల సభ్యుల గౌరవ వేతనాలను పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ లు, జెడ్పీటీసీ,

10TV Telugu News

Salaries Hiked : తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల సభ్యుల గౌరవ వేతనాలను పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ మెంబర్ల జీతాలు పెరిగాయి. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెరిగింది. అలాగే ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6వేల 500కు పెంచుతూ పంచాతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మండలాధ్యక్షులకు వేతనం ప్రస్తుతం రూ.10వేలు ఉండగా, ఇక నుంచి రూ.13వేలు అందుకుంటారు.

Bank Customers : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

వేతనాల పెంపునకు సంబంధించి మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. వేతనాల పెంపు ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్దిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు.. ఉద్యోగులతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30 శాతం మేర గౌరవ వేతనం పెంచడం జరిగిందన్నారు.

Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్

పెరిగిన వేతనాలు జూలై నెల నుండే అమల్లోకి రానున్నాయి. చాలీచాలని గౌరవ వేతనాలతో ఇబ్బంది పడుతున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ నిర్ణయంతో కాస్త ఉపశమనం కలిగినట్టు అయ్యింది.