Telangana : ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో కొత్త పథకం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.

Telangana : ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో కొత్త పథకం

Telangana

Telangana : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం బడులు బాగు అనే పథకం ద్వారలో పట్టాలెక్కనుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గత బడ్జెట్‌లో ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.4,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

చదవండి : Telangana Corona : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షంలో త్వరలోనే ఈ పథకాన్ని కేబినెట్‌లో పెట్టి ఆమోదం తెలిపి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఇదే సమయంలో యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో.. ఆయా కాలేజీల్లో ఏవేం కోర్సులు ఉన్నాయో మ్యాపింగ్ చేయాలని అధికారులకు సూచించారు.

చదవండి : Telangana Government : ఉద్యోగుల విభజన కోసం విధివిధానాలు ఖరారు