Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ మంజూరు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శభవార్త చెప్పింది. 2.73శాతం డీఏ పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.28 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది.

Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ మంజూరు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

CM KCR

Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.73శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021 జులై 1 నుంచి డీఏ చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. ప్రస్తుతం ఒక్క డీఏను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని జనవరి పెన్షన్‌తో కలిపి పెన్షన్ దారులకు ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే, 2021 జులై నుంచి 2022 డిసెంబరు వరకు ఉన్న డీఏ బకాయిలు ఎనిమిది విడుతల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.

Telangana Government : టీచర్లకు తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక.. బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వానికి పలుమార్లు వినతులను సమర్పించారు. తాజాగా ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఉత్తర్వుల పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉంటే సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ట్విటర్ ద్వారా తెలిపారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో ప్రస్తుతం ఉన్న 17.29శాతాన్ని 20.02 శాతానికి పెంచడం జరిగిందని అన్నారు. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.28 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలుగుతుందని అన్నారు.

 

ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ నుసైతం ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈనెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. బదిలీల ప్రక్రియ మొత్తం 37 రోజుల్లో ముగియనుంది.