Covid Fee : ప్రైవేట్‌లో కరోనా చికిత్స, టెస్టుల ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు

Covid Fee : ప్రైవేట్‌లో కరోనా చికిత్స, టెస్టుల ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం

Covid Fee

Covid Fee : ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం(జూన్ 23,2021) జీవో నెంబర్ 40 జారీ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ వార్డుల్లో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ. 4 వేలు వసూలు చేయాలని నిర్ధారించారు. ఐసీయూ గదిలో రోజుకు గరిష్టంగా రూ. 7,500 గా నిర్ణయించారు. వెంటిలేటర్ పై ఐసీయూలో చికిత్స చేస్తే రోజుకు రూ. గరిష్టంగా రూ. 9 వేలే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పీపీఈ కిట్ ధర రూ. 273 కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌లు:
సాధార‌ణ అంబులెన్సుకు క‌నీస చార్జీ రూ.2 వేలు
హెచ్ఆర్సీటీ-రూ.1,995
డిజిట‌ల్ ఎక్స్‌రే- రూ.1,300
డీ డైమ‌ర్ ప‌రీక్ష‌-రూ.300
సీఆర్పీ-రూ.500
ప్రొకాల్ సిటోనిన్-రూ.1,400
ఫెరిటిన్-రూ.400
ఎల్డీహెచ్‌-రూ.140

సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సు కు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలు
ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సు కు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. డీహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రోజుకు సరాసరి 1.17లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై జీవో జారీ చేసినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 170 ప్రైవేట్ ఆస్పత్రులపై 350 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 30 ఫిర్యాదులు పరిష్కరించి, రూ.72.20 లక్షలు బాధితులకు వెనక్కి ఇప్పించామని చెప్పారు. మిగతా బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని కోర్టుకి తెలిపారు డీహెచ్ శ్రీనివాసరావు.