Age Relaxation : 34 కాదు 44.. నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయో పరిమితిని ఏకంగా..

Age Relaxation : 34 కాదు 44.. నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

Age Relaxation

Age Relaxation : తెలంగాణలో నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో పరిమితిని ఏకంగా పదేళ్లపాటు పెంచింది. ప్రస్తుతం 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయసును 44 ఏళ్లకు పెంచారు.

CM KCR Meeting : మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ.. ఉద్యోగాల భర్తీ-జాబ్ కేలండర్, ధాన్యం కొనుగోళ్లపై చర్చ

ఈ గరిష్ట వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తించనుంది. అంటే 2024 మార్చి 18వ తేదీ వరకు వెసులుబాటు ఉంటుంది. యూనిఫాం సర్వీసులైన పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మినహా మిగతా ఉద్యోగాలకు ఈ గరిష్ట వయో పరిమితి పెంపు వర్తిస్తుంది.(Age Relaxation)

CM KCR : సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్..ఈ వారంలోనే ఉద్యోగ నొటిఫికేషన్ ?

80వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. వయో పరిమితిని కూడా పెంచుతామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణగా సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయస్సు 44 ఏళ్లకు పెరిగింది.

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో 81వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. దశలవారీగా వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉద్యోగార్ధులకు తగిన సమయం ఇస్తూ పరీక్షలను నిర్వహించనుంది. దీనిపై సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ వేదికగా మెగా జాబ్స్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక ఇదే సమయంలో ఇంతకాలం నిరీక్షించి వయోపరిమితి నేపథ్యంలో తమకు ఉద్యోగం వస్తుందా లేదా అని ఆవేదనలో ఉన్న నిరుద్యోగులకు సైతం గుడ్ న్యూస్ చెప్పారు కేసీఆ.ర్ పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహాయించి ఇతర ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన సమయంలో సీఎం కేసీఆర్ వయోపరిమితిపైనా కీలక ప్రకటన చేశారు.ఏజ్ లిమిట్ పెంచుతున్నట్లుగా వెల్లడించారు.

ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో ప్రభుత్వం ఉంది. ఏ క్షణంలోనైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం ఓబీసీలకు 34 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 39 సంవత్సరాలు, దివ్యాంగులకు 44 సంవత్సరాలు వయో పరిమితి గా ఉంది. గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. ఓబీసీలకు 44 ఏళ్లకు.. ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 ఏళ్లకు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో చాలామందికి అదనంగా లాభం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనుంది టీఎస్ పీఎస్సీ. ప్రస్తుతం హోంశాఖలో 18వేల 334 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 13వేల 86 పోస్టులు, వైద్య ఆరోగ్యశాఖలో 12వేల 755 పోస్టులు, ఉన్నత విద్యలో 7వేల 878 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలో 4 వేల 311 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.