Women’s University : తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణలో తొలి ఉమెన్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మహిళా వర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్యామండలి అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు.

Women’s University : తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Women University

Telangana Government : మహిళల అభ్యున్నతి, ప్రొటెక్షన్ కోసం ఎన్నో చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవో జారీ చేసింది.

కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణలో తొలి ఉమెన్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మహిళా వర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్యామండలి అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు.

Telangana Jobs : నిరుద్యోగుల‌కు తెలంగాణ ప్రభుత్వం మ‌రో శుభవార్త

మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఉత్తర్వుల కాపీని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్ కు అందజేశారు. ఈ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.