Telangana Govt : 111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేత

కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు 111 జీవో ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై తీవ్ర కసరత్తు చేసిన తెలంగాణ సర్కార్ చివరికి 111 జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Telangana Govt : 111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేత

111 Go

Telangana government : 111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 84 గ్రామాలకు 111 జీవో నిబంధనల నుంచి విముక్తి లభించింది. జంట జలాశయాలు కలుషితం కాకుండా సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్​మండలాలు పూర్తిగా.. వికారాబాద్ జిల్లాలోని శంకర్​పల్లి, చేవెళ్ల, షాద్​నగర్, షాబాద్​ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు ట్రిపుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై తీవ్ర కసరత్తు చేసిన తెలంగాణ సర్కార్… చివరికి జీవో నెంబర్‌ 111 ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ వన్ జీవో రద్దుపై సీఎఎస్ నేతృత్వంలో కమిటి కూడా వేసింది తెలంగాణ ప్రభుత్వం. కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ అధికారులతో కలిసి కమిటిని ఏర్పాటు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నది, ఈసా నది, ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా గ్రీన్‌జోన్స్ డిక్లేర్ చేస్తూ… మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ జీవో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించింది.

హైదరాబాద్ పట్టణానికి తాగు నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ, ట్రిపుల్ వన్ జీవో ఎత్తి వేస్తామంటూ ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో ట్రిపుల్ వన్ జీరో పరిధిలో పెద్ద ఎత్తున భూ లావాదేవీలు జరిగాయి. బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా ట్రిపుల్ వన్ జీవో పరిధిలో భారీగా పెట్టుబడులు పెట్టారు. గతంలో చాలా మంది కోర్టును సైతం ఆశ్రయించారు. అయినప్పటికి ఫలితం దక్కలేదు.

Cooking Gas Supply : తెలంగాణలో ఇంటింటికి వంట గ్యాస్‌ సరఫరా

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక జీవో నెంబర్ 111 ను టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి ఈ పరిధిలోని ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ ట్రిపుల్ వన్ జీవోపై సమీక్ష జరిపారు. అంతేకాకుండా జీవో పరిధిలోని జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. గతంలో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా కేబినెట్ ఆ జీవోను రద్దు చేయడంతో ఆ జీవో పరిధిలోని ప్రజలు, పెట్టుబడులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 111 ఎత్తేస్తే రియల్ ఎస్టేట్ కొత్త కొత్త రికార్డులనే సృష్టిస్తుంది.

జీఓ నెంబర్‌ 111.. సుమారు 25 ఏళ్ల నుంచి వినిపిస్తున్న ప్రభుత్వ ఆర్డర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూసీ నదితో పాటు, హైదరాబాద్‌కు తాగునీరందించిన జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల పరిరక్షణ ఓసం అప్పటి ప్రభుత్వం 1996లో ట్రిపుల్ వన్ జీవోను తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ట్రిపుల్ వన్ జీవో పరిధిలో వ్యవసాయం తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం పలు రకాల ఆంక్షలు విధించింది అప్పటి ప్రభుత్వం. దీంతో 111 జీఓ పరిధిలోకి వచ్చే 84 గ్రామాలు అభివృద్దికి నోచుకోకుండా పోయాయి. ట్రిపుల్ వన్ జీవో పరిధి పక్కన ఉన్న రెసిడెన్షియల్ భూములు కోట్లు కుమ్మరిస్తున్నా… ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని భూముల ధరలు రెండు, మూడు కోట్లకు మించి ధర పలకడం లేదు. దీంతో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ట్రిపుల్‌ 111 జీవో ఎత్తివేస్తూ కేబినెట్‌ తీర్మానం చేయడంతో ఆ పరిధిలోని 84 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ సర్కార్ నిర్ణయంతో ట్రిపుల్ వన్ జీవో పరిధిలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరగనుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రిపుల్ వన్ జీఓ రద్దు తరువాత దీని పరిధిలోకి వచ్చే సుమారు 1 లక్షా 32 వేల ఎకరాల్లో పరిమిత నిబంధనలతో రెసిడెన్షియల్ జోన్‌గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. మూసి నదితో పాటు జంట జలాశయాలకు ఏ మాత్రం హాని జరగకుండా పర్యావరణ పరిరక్షణతో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అంటే ఇక ఈ ప్రభుత్వ భూమి కాకుండా సుమారు లక్ష ఎకరాల్లో పక్కా ప్రణాళికా నగరం ఏర్పాటు కాబోతోంది. పూర్తి పచ్చదనంతో హైదరాబాద్ ను మించిన గ్రీన్ సిటీకి పునాదులు పడ్డట్టేనని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

పాతికేళ్లగా హైద‌రాబాద్ వాయు వేగంతో విస్తరించడంతో నగరంలో జీవో 111 పరిధి వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు దాన్ని ఎత్తివేయడంతో హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోనున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో నిర్మాణాలున్నప్పటికీ దానికి చాలా పరిమితులున్నాయి. ఇప్పుడు జీవోను ఎత్తివేడయంతో మొత్తం మారిపోనుంది. అక్కడ రియల్‌ బూమ్‌ను పట్టుకోవడం సాధ్యం కాదు. జీవో ఎత్తేసిన మరుక్షణం ఇక్కడ భూముల ధరలు రెట్టింపైనా ఆశ్చర్యం లేదు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలోనే ఈ 111 జీవో రద్దుపై హామీ ఇచ్చారు. జీవో 111 రద్దుపై గడచిన పాతికేళ్లలో ఒత్తిడి చాలా పెరిగింది. సీఎం కేసీఆర్‌ కూడా గతంలో ఈ జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని రద్దు చేశారు.

Telangana : తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 2 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. శంషాబాద్‌, మెయినాబాద్‌, రాజేంద్రనగర్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్‌ మండలాల్లోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి మహబుబ్ నగర్ లోని కొత్తూరు మండలానికి చెందిన మరో రెండు గ్రామాలు కలిపి మొత్తం 84 గ్రామాలు. ఈ గ్రామాల్లో నిర్మాణాలపై నిషేధిస్తూ ప్రభుత్వం 111జీవోను అమల్లోకి తెచ్చింది. ఈ జివో కారణంగా తమ ప్రాంతం అభివృద్దికి దూరం అయ్యందంటూ ఈగ్రామాల ప్రజలు చాలా కాలంగా ఆందోళలన చెందుతున్నారు. ఈ జీవో పరిధిలోని 84గ్రామాల విస్తీర్ణంలో లక్షా 32వేల ఎకరాల 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మండలాల పరిధిలో గత 10-15 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. దీంతో ఇక్కడి భూములు ధరలు గజం రూ. 40-60 వేలకు చేరాయి. ఇప్పుడు 111జీవోను తొలగిస్తుండటంతో ఇక ఆ ప్రాంతంలో భూములకు రెక్కలు వస్తాయి. రేట్లను పట్టుకునే అవకాశమే లేదు.

ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌ల జంట జ‌లాశ‌యాలు నిర్మాణాలతో క‌లుషితం కాకూడదనే ల‌క్ష్యంతో అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ జీవో 111 తో ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌ల ప‌రివాహ‌క ప్రాంతంలో ప‌రిశ్రమలు ఏర్పాటు చేయడం, భారీ నిర్మాణాలు చేపట్టడం నిషేధించారు. ట్రిపుల్ వన్ జీవో ప‌రిధిలోని నిర్మాణాలపై ఆంక్షలు కొన‌సాగ‌తుండ‌టంతో.. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. జీవో 111 ర‌ద్దు చేయాల‌న్న స్థానికుల డిమాండ్‌కు రాజ‌కీయ పార్టీలు సైతం జైకొట్టాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులకు, బడా పారిశ్రామికవేత్తలకు ఇక్కడ ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. కొందరికి వందల ఎకరాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే 111 జీవో పరిధిలోని ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అది మరో మినీ హైదరాబాద్‌గా మారిపోనుంది. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లతో ఆ ప్రాంతం హైఫై సిటీగా మారిపోనుంది. ఇంతకాలం దీనికి 111జీవో అడ్డుగా మారింది.

Telangana : వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..మేయర్‌ గుండు సుధారాణికి రూ.2లక్షలు జరిమానా

టిఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. సీఎస్ అధ్యక్ష్యతన 2016 లో హైప‌వ‌ర్ క‌మిటీ వేసింది. జంట జ‌లాశ‌యాలు రాజ‌ధానికి తాగునీరు అందించేవి కావ‌డంతో.. జీవో 111ను ప‌టిష్టంగా అమ‌లు చేయాలని సుప్రీంకోర్టు, ఎన్జీటీ గతంలో ఆదేశించాయి. అయితే.. ఇప్పుడు రాజ‌ధానికి కృష్ణా, గోదావ‌రి నుంచి తాగునీరు వ‌స్తుండ‌టంతో.. వాటికోసం.. న‌గ‌రం న‌లుదిక్కులా నాలుగు జ‌లాశ‌యాల‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనివల్ల జంట జ‌లాశ‌యాల తాగునీరు క‌లుషితం కానుందన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు న్యాయ‌స్థానాల్లో కూడా.. ట్రిపుల్ వన్‌కు ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించ‌వ‌చ్చని సీఎం కేసీఆర్ ఆలోచించారు. జీవో111 ను ఎత్తివేసేందుకు గ్రౌండ్ రిపోర్ట్‌గా హైప‌వ‌ర్ క‌మిటీ రిపోర్టును ఉపయోగించుకుంది ప్రభుత్వం.

వాస్తవానికి హైదరాబాద్ నగరాన్ని వరద ముంపు నుంచి రక్షించడానికి గండిపేట , అంటే ఉస్మాన్ సాగర్ కట్టారు. నగరానికి మంచినీటి కోసం హిమాయ‌త్ సాగ‌ర్ కట్టారు. ఆనాడే ఈ రెండు ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలకు ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దని నిజాం ఒక ఫర్మాన జారీ చేశారు. అంటే జంట జలాశయాలను రక్షించాలన్న ప్రయత్నం ఈనాటిది కాదన్న మాట. ఆనాటి ప్రయత్నాలకు కొనసాగింపుగానే ఈ జీవో 111 వచ్చిందని చెప్పొచ్చు. వరదనీరు సులువుగా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాలకు చేరాలనేది ఈ జీవో ముఖ్య ఉద్దేశం. జలాశయాలకు ఎగువన 10 కిలోమీటర్ల రేడియస్ వరకు ఈ జీవో వర్తిస్తుంది. మరో విషయం ఏమంటే రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 84 గ్రామాలకు చెందిన భూములు ఈ జీవో పరిధిలోకి వస్తాయి.

CM KCR : వ్యవసాయరంగంలో కేంద్రం తీరుపట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తి

అంటే …ఈ ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమలు రాకూడదు. భారీ నివాస సముదాయాలు కట్టకూడదు. పెద్ద హోటళ్ల నిర్మాణం నిషేధించారు. వందశాతం భూమిలో కేవలం 10 శాతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని నిబంధనల్లో పొందుపరిచారు. వెంచర్లు, నిర్మాణాలను రిజిస్ట్రేషన్‌ చేయరాదనే ఆదేశాలు కూడా ఉన్నాయి. కేవలం వ్యవసాయ భూములు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది. అయితే ఏళ్లు గడిచే కొద్దీ ఈ నిబంధనలు పట్టించుకోవడం మానేశారు. ఆయా ప్రాంతాల్లో… భారీ నిర్మాణాలే వెలిశాయి. ఇప్పుడు ప్రభుత్వం 111 జీవోను ఎత్తేసేందుకు తీసుకున్న నిర్ణయంతో అందరికీ రిలీఫ్‌ దక్కనుంది.