Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రేటర్ హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో తాగునీరు ఉచితంగా ఇవ్వాలని ఆదేశం

నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో వేర్వేరు బ్రాండ్ల పేరుతో వాటర్ బాటిల్ ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు.

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రేటర్ హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో తాగునీరు ఉచితంగా ఇవ్వాలని ఆదేశం

Telangana Govt

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో తాగునీరు ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పని సరిగా జలమండలి సరఫరా చేసే తాగునీటిని గానీ, ఆర్ఓ వాటర్, శుద్ధి చేసిన నీటిని గానీ తప్పని సరిగా ఉచితంగా అందించాలని తెలిపింది.

ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించింది. ఒకవేళ, హోటళ్లు, రెస్టారెంట్లలో తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తే ఆయా బాటిల్స్ పై ముద్రించిన గరిష్ట ధరను మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో వేర్వేరు బ్రాండ్ల పేరుతో వాటర్ బాటిల్ ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు.

Telangana : తెలంగాణలో ఇక 24 గంటలు వ్యాపారాలు చేసుకోవచ్చు .. షరతులు వర్తిస్తాయి

గతంలో ఏదైనా హోటల్, రెస్టారెంట్ లో ఉచితంగా మంచినీరును అందించేవారు. కానీ, ఇటీవల కాలంలో మంచినీరు ఉచితంగా ఇస్తున్నా అవి అంత స్వచ్ఛంగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా రెస్టారెంట్, హోటళ్లలో వాటర్ బాటిల్ ను విక్రయిస్తున్నారు. వాటిని అధిక ధరలకు అమ్ముతున్నారు. హోటల్, రెస్టారెంట్ లో మంచినీరు స్వచ్ఛంగా లేకపోవడంతో తప్పకుండా వాటర్ బాటిల్ ను కొనుగోలు చేయాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లలో మంచినీరు ఉచితంగా అందించాలని సూచించింది.