అగ్రవర్ణ పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

అగ్రవర్ణ పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

telangana government orders ews reservations: EWS రిజ‌ర్వేష‌న్లపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవరి 8,2021) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.

ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూనే, రాష్ట్రంలోని ఈడబ్ల్యూఎస్‌లకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్‌తో కలుపుకొని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్‌లకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. 19 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయి. తెలంగాణలో కూడా దాదాపుగా ఇదే విధంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉంది.

EWS రిజర్వేషన్లు.. అర్హతలు ఇవే..
EWS రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం రూ.8లక్షలలోపు వార్షిక ఆదాయం, 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి, వెయ్యి చ.అడుగుల లోపు ఇల్లు ఉన్న వారు, రెసిడెన్షియల్ ప్లాట్ 109 చ.గజాలు, నాన్ మున్సిపాలిటీల్లో 209చ.గజాల్లోపు ఉన్నవారికే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.