Reservation : మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

10TV Telugu News

Reservation  : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-23 సంవత్సరాలకు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉండనున్నాయి.

Read More : Balapur Laddu: సీఎం జగన్ చేతికి బాలాపూర్ లడ్డు