Telangana : పెద్దవాగు ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు సిద్ధంగా లేమన్న తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు సిద్ధంగా లేమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్ట్‌ విషయంలో చేయాల్సిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.

Telangana : పెద్దవాగు ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు సిద్ధంగా లేమన్న తెలంగాణ

Peddavagu

Bhadradri Kottagudem peddavagu project : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు ప్రస్తుతం సిద్ధంగా లేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌ విషయంలో చేయాల్సిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. అవన్నీ పూర్తయిన తరువాతే ప్రాజెక్ట్‌ టేక్‌ ఓవర్‌ చేస్తామని తెలింపింది. ఇరిగేషన్‌ సెక్రెటరీ రజత్‌ కుమార్‌ జీఆర్‌ఎంబీ సబ్‌ కమిటీకి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఇక పెద్దవాగుతో పాటు తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ జీఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ఇరిగేషన్‌ శాఖ కోరింది. కేవలం పెద్దవాగు మాత్రమే టేక్‌ ఓవర్ చేయడం వల్ల ఏపీకి పెద్దగా లాభం లేదని వివరించింది. లీన్‌ పీరియడ్‌లో తెలంగాణలోని గోదావరీ జలాలను చెరువులకు మళ్లిస్తున్నారని దీంతో ఏపీలో నీటి కొరత ఏర్పడుతోందని తెలిపారు.

KRMB Projects : కృష్ణా బోర్డు పరిధిలోకి 29 ప్రాజెక్టులు..అంగీకారం తెలిపిన ఏపీ, తెలంగాణ

కృష్ణానదిపై తెలంగాణలో ఉన్న ఏడు ప్రాజెక్టులు, ఏపీలోని 22 ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకురావాలనే వాదననను పక్కన పెడుతూ.. ఇరు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌ జలసౌధలో గోదావరి బోర్డు, మధ్యాహ్నం కృష్ణా బోర్డు ఉప కమిటీ సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశాల్లో రెండు నదులపై తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఏయే ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్తాయనే అంశం ఓ కొలిక్కి వచ్చింది. తొలిదశలో తెలంగాణలోని 7 ప్రాజెక్టులు, ఏపీలోని 22 ప్రాజెక్టులను తీసుకోవాలని బోర్డు ప్రతిపాదించింది. దీనికి తెలంగాణ పూర్తి స్థాయిలో ఆమోదం తెలుపగా.. బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌పై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోకూడదని కోరింది.