‘104’ Ambulance: తెలంగాణలో 104 అంబులెన్సు సేవలు బంద్: వాహనాల వేలంకు ప్రభుత్వం ఉత్తర్వులు

స్థిర దిన ఆరోగ్య సేవలు (FDHS) కింద దాదాపు 12 ఏళ్ల పాటు సేవలు అందించిన 104 వాహనాలను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

‘104’ Ambulance: తెలంగాణలో 104 అంబులెన్సు సేవలు బంద్: వాహనాల వేలంకు ప్రభుత్వం ఉత్తర్వులు

104

‘104’ Ambulance: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివిధ వైద్యసేవలు అందించిన 104 సేవలు ఇకపై నిలిచిపోనున్నాయి. స్థిర దిన ఆరోగ్య సేవలు (FDHS) కింద దాదాపు 12 ఏళ్ల పాటు సేవలు అందించిన 104 వాహనాలను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గురువారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 198 వాహనాలను వేలం వేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం. 104 వ్యవస్థలో సేవలు అందిస్తున్న 1250 మంది సిబ్బందిని ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. రూరల్ ఏరియాల్లో ప్రత్యేక వైద్యసేవల నిమిత్తం 2009లో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన 104 అంబులెన్సు సర్వీసుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు జీవనశైలిలో మార్పుల కారణంగా వచ్చే రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు.

Other Stories: Student Suicide: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య: టీఆర్ఎస్ కార్పొరేటర్ సుక్క శివకుమార్ పై బాధిత కుటుంబం ఆరోపణ

అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ‘జీవనశైలి వ్యాధుల నివారణ’ పథకం అందుబాటులోకి రావడంతో 104 సేవలకు పెద్దగా పనిలేకుండా పోయింది. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాలు కూడా తెరుస్తుండడంతో ఇకపై 104 సేవలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే గత ఆరు నెలలుగా 104 అంబులెన్సు వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాహనాలు కదిలించకపోవడంతో తుప్పు పట్టి పాడైపోతున్నాయి. దీంతో వాహనాలను వేలం వేయడంతో పాటు సిబ్బందిని ఇతర సేవలకు వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం సూచించింది.

Other Stories: Amit Shah On Telangana : తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోంది-అమిత్ షా కీలక వ్యాఖ్యలు