మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది.

మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు

leave for government women employees : ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. రేపు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళ దినోత్సవం రోజున ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదివారం (మార్చి 7, 2021) ఆయన ఆదేశించారు.

మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అనేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని గుర్తు చేశారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతూ మహిళలు ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు. జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని చెప్పారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పించన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. అంగన్ వాడీ ఆశావర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా అనేక పథకాల్ని అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమంలో ముందంజలో ఉందని గుర్తు చేశారు.