Telangana : రాజ్ భవన్‌‌లో అపశృతి.. కిందపడిపోయిన గవర్నర్

రాజ్ భవన్ లో అపశృతి చోటు చేసుకుంది. ఉగాది వేడుకలు జరుగుతున్న సందర్భంలో...ఏర్పాటు చేసిన స్టేజీ కింద ప్రముఖుల దగ్గర గవర్నర్ కూర్చొనే కుర్చీ పక్కకు ఒరిగిపోయింది....

Telangana : రాజ్ భవన్‌‌లో అపశృతి.. కిందపడిపోయిన గవర్నర్

Rajbhavan (1)

Telangana Governor : రాజ్ భవన్ లో అపశృతి చోటు చేసుకుంది. ఉగాది వేడుకలు జరుగుతున్న సందర్భంలో…ఏర్పాటు చేసిన స్టేజీ కింద ప్రముఖుల దగ్గర గవర్నర్ కూర్చొనే కుర్చీ పక్కకు ఒరిగిపోయింది. దీంతో గవర్నర్ తమిళిసై కింద పడిపోయారు. వెంటనే అక్కడున్న సెక్యూర్టీ అలర్ట్ అయ్యారు. తక్షణమే తేరుకున్న గవర్నర్ అదే కుర్చీలో కూర్చొన్నారు. వ్యక్తిగత సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : Telangana Raj Bhavan : రాజ్ భవన్‌‌లో ఉగాది వేడుకలు, సీఎం కేసీఆర్ గైర్హాజర్.. ఫ్లెక్సీలో ప్రధాని, గవర్నర్ ఫొటోలు

మరోవైపు.. ఈ ముందస్తు ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్,. మంత్రులు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వేడుకలకు హాజరు కావాలని గవర్నర్ ఆహ్వాన పత్రాలు పంపారు. కానీ వీరు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఉత్సవాల ఫ్లెక్సీలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఫొటోలు మాత్రమే ఉండడం గమనార్హం. ఫ్లెక్సీపై సీఎం కేసీఆర్ ఫొటో కనిపించకపోవడంపై చర్చనీయాంశమైంది. శుభకృత్ నామ సంవత్సరం ముందస్తు ఉగాది వేడుకలను సాయంత్రం నిర్వహించారు. కేవలం ఎమ్మెల్యే కల్వకుంట్ల జయ్ పాల్ యాదవ్ మాత్రమే పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇతరులు హాజరయ్యారు. ప్రధానంగా సీఎం – గవర్నర్ మధ్య దూరం పెరుగుతోందా ? అనే టాక్ వినిపిస్తోంది. రాజ్ భవన్, ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరుగుతోందనే చర్చ జరుగుతోంది.