Republic Day : రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవాలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతోందని గవర్నర్ తమిళి సై అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ దేశ వ్యాప్తంగా ఉదృతంగా కొనసాగుతోందని తెలిపారు.

Republic Day : రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవాలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

Tamilisai 11zon

Governor Tamili Sai unveiling the National Flag : హైదరాబాద్ రాజ్ భవన్ లో కోవిడ్ నిబంధనల మధ్య 73వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ సైనిక వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతోందన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ దేశ వ్యాప్తంగా ఉదృతంగా కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా రెండు వందల కోట్ల వ్యాక్సిన్ పూర్తి చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఎదగటం సంతోషకరమన్నారు.

New Districts : ఏపీలో కొత్త జిల్లాలు ఇవే..!

తెలంగాణ.. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని కొనియాడారు. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు ఈ సందర్భంగా గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది కొనియాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 8 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.