Civils Coaching Academy : ఉస్మానియా యూనవర్సిటీలో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభం

ఉస్మానియా యూనవర్సిటీ(ఓయూ)లో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభమైంది. ఓయూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం(డిసెంబర్ 14,2022) ప్రారంభించారు.

Civils Coaching Academy : ఉస్మానియా యూనవర్సిటీలో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభం

Civils Coaching Academy

Civils Coaching Academy : ఉస్మానియా యూనవర్సిటీ(ఓయూ)లో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభమైంది. ఓయూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం(డిసెంబర్ 14,2022) ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులు సివిల్ సర్వీస్ లాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలన్నదే ఈ అకాడమీ ఏర్పాటు ముఖ్య ఉద్ధేశమని అధికారులు తెలిపారు.

ఈ అకాడమీలో ఒకేసారి 1000 మంది అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రూ. 2 కోట్లతో అభివృద్ధితో చేసిన ఈ అకాడమీ విద్యార్థుల ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతుందని వీసీ రవీందర్ యాదవ్ పేర్కొన్నారు.

Osmania University: ఓయూ 82వ స్నాతకోత్సవం, సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్

ఈ కార్యక్రమానికి ఐఏఎస్ లు వాకాటి అరుణ, నవీన్ మిట్టల్, బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్ యాదవ్, టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణితోపాటు పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు హాజరయ్యారు.