Corona : మాస్క్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా, బహిరంగ సభలపై నిషేధం.. రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పొడిగింపు

ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్‌లో.. మాస్క్‌, భౌతికదూరం నిబంధన తప్పనిసరి..

Corona : మాస్క్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా, బహిరంగ సభలపై నిషేధం.. రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పొడిగింపు

Telangana Corona

Corona : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్‌ ఆంక్షలను ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈ నెల 10వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై సీఎస్ సోమేష్‌ కుమార్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

Omicron Symptoms : చర్మంపై ఇలా దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్‌ లక్షణం కావొచ్చు..!

అనేక రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు కోవిడ్ కొత్త కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎస్. ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సభలకు సైతం అనుమతి ఇవ్వొద్దని సీఎస్ చెప్పారు. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్‌లో.. మాస్క్‌, భౌతికదూరం నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యా సంస్థల్లో సిబ్బంది, విద్యార్థులు మాస్క్‌లు పెట్టుకునేలా చూడాలన్నారు. మాస్క్‌ లేకపోతే రూ.వెయ్యి జరిమానా కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు సీఎస్.

మరోవైపు తెలంగాణలోనూ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. వారిలో 27 మంది కోలుకున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి.

ఇక, రోజువారీ కరోనా కేసుల విషయానికొస్తే… గడచిన 24 గంటల్లో 28వేల 886 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 317 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 217 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 26, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి.

WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

అదే సమయంలో 232 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,215 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,74,453 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,029కి పెరిగింది.