Schools Holidays : స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించింది. ఈ నెల 20 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Schools Holidays : స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Schools Holidays

Schools Holidays : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించింది. ఈ నెల 20 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన మేరకు ఇవాళ్టితో(జూన్ 15,2021) వేసవి సెలవులు ముగిశాయి. రేపటి(జూన్ 16,2021) నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది.

ఇంతలో సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ నెల 20వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే స్కూళ్లకు కూడా ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు తెలుస్తోంది. అన్ని స్కూళ్లు, డైట్‌ కాలేజీలకు సెలవులను పొడిగిస్తూ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. లాక్‌డౌన్, కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

కొత్తగా 1556 కరోనా కేసులు.. 14 మరణాలు:
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,556 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 3వేల 510గా ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,06,436కు పెరిగింది. ఇక కరోనా నుంచి కొత్తగా 2070 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,82,993గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,933 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,20,043 కరోనా సాంపిల్స్‌ను పరీక్షించామని.. మొత్తంగా ఇప్పటివరకు 1,69,54,634 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం(జూన్ 15,2021) సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.