Governor Tamilisai-Telangana Govt : పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్..గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని ప్రతివాదిగా చేర్చిన ప్రభుత్వం

పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్..గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని ప్రతివాదిగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.

Governor Tamilisai-Telangana Govt : పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్..గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని ప్రతివాదిగా చేర్చిన ప్రభుత్వం

Governor Tamilisai- Telangana Govt :

Governor Tamilisai- Telangana Govt : కొంతకాలంనుంచి ఉప్పు నిప్పుగా ఉంటున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్..మధ్య వివాదం ముగిసిపోయిందనే అందరు అనుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్(KCR) మర్యాదపూర్వకంగా గవర్నర్ తమిళిసైకు స్వయంగా స్వాగతం పలకటం..ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై(Governor Tamilisai).. ప్రసంగించటంతో వివాదం ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ ఈ వివాదం ముగిసిపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాజ్ భవన్ లో ఉన్న పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ కు మధ్య వివాదం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంట్లో గవర్నర్ తమిళిసైను ప్రతివాదిగా చేర్చింది.

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వద్ద ఉన్న 10 బిల్లుల‌ను ఆమోదించ‌క‌పోవ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి(CS Shanthi Kumari) సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేయనున్నారు. ఈ పిటిష‌న్‌లో ప్ర‌తివాదిగా త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేరును చేర్చారు. బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేయనున్నారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ రేపు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో దవే వాదనలు వినిపించనున్నారు.

Also Read: తెలంగాణలో ఫాక్స్ కాన్ కంపెనీ భారీ పెట్టుబడులు.. లక్షమందికి ఉద్యోగాలు

గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు
1) తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు
2) ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసే బిల్లు
3) ఆజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ
4) మున్సిపల్‌ చట్ట సవరణ
5) పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ

6) ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు
7) మోటర్‌ వెహికిల్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లు
8) మున్సిపల్ చట్ట సవరణ -2
9) పంచాయితీ రాజ్ చట్ట సవరణ-2
10) అగ్రికల్చర్ యూనివర్సిటీ