Telangana : కిడ్నీ రోగుల‌కు ఉచితంగా డ‌యాల‌సిస్‌..ప్ర‌త్యేక కేంద్రాల ఏర్పాటుకు మంత్రి ఆదేశం

కిడ్నీ రోగుల‌కు ఉచితంగా డ‌యాల‌సిస్‌ అందించటం కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

Telangana : కిడ్నీ రోగుల‌కు ఉచితంగా డ‌యాల‌సిస్‌..ప్ర‌త్యేక కేంద్రాల ఏర్పాటుకు మంత్రి ఆదేశం

Free Dialysis For Kidney Patients

free dialysis for kidney patients in Telangana : కిడ్నీ సమస్యలు వచ్చిన డయాలసిస్ పరిస్థితికి వస్తే ఇక ఆరోగుల బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవారి కష్టాలు ఎన్నని చెప్పాలి. డయాలసిస్ కోసం ఎంతో డబ్బు మంచినీళ్లలా ఖర్చు అయిపోతుంటుంది.అటువంటివారు ప్రభుత్వం సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూస్తారు. అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది.

Read more : పెరుగుతున్న కిడ్నీ సమస్యలు…అసలు కారణాలు ఇవే!

కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెప‌టైటిస్ రోగుల‌కు ఉచిత డ‌యాల‌సిస్ సేవ‌లు అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కిడ్నీ రోగుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి డయాలసిప్ చేయాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో‌ జరిగిన సమీక్షలో పాల్గొన్న మంత్రి హ‌రీశ్‌రావు హైద‌రాబాద్, వ‌రంగ‌ల్ న‌గ‌రాల్లో ప్ర‌త్యేక కేంద్రాల ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేంద్రాల‌ను అందుబాటులోకి తేవాల‌ని ఆదేశించారు.

ఈ కేంద్రాల్లో ఎయిడ్స్, హెప‌టైటిస్ రోగుల‌కు ఐదు బెడ్ల చొప్పున కేటాయించి డ‌యాల‌సిస్ సేవ‌ల‌ను అందించాల‌ని సూచించారు. డ‌యాల‌సిస్ చేయించుకోవ‌డం కిడ్నీ రోగుల‌కు ఆర్థికంగా చాలా భారంగా మారింద‌ని..ప్రభుత్వం వారి బాధలను అర్థం చేసుకుందని..వారికి ఊరట కల్పించేలా వారి కోసం ప్ర‌త్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి డయాలసిస్ చేయాలని నిర్ణయించిందని తెలిపారు.

Read more : Banana : రోజుకో అరటిపండుతో…గుండె, కిడ్నీ సమస్యలకు చెక్

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ పరిధిలో 43 డ‌యాల‌సిస్ కేంద్రాలు న‌డుస్తున్నాయ‌ని..వీటిని మరింతగా పెంచాలనుకంటున్నామని. ఇప్పటికే ఉన్న ఈ 42 కేంద్రాల ద్వారా 10 వేల మంది రోగుల‌కు సేవ‌లు పొందుతున్నారని తెలిపారు. డ‌యాల‌సిస్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌కు సంవత్సరానికి రూ. 100 కోట్ల‌ు ఖర్చు అవుతోందనీదాన్ని ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించారు. కిడ్నీ రోగులు ఏమాత్రం ఇబ్బంది పడుకుండా మెషీన్లను ఏర్పాటు చేసి, వారు ఎదురుచూసే పనిలేకుండా చేయాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు.