Stipend : నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్, భారీగా స్టైఫండ్ పెంపు

తెలంగాణలో నర్సింగ్‌ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ కాలేజీల్లో జీఎన్‌ఎం, బీఎస్సీ, నర్సింగ్‌ కోర్సు చదువుతున్న విద్యార్థులకు స్టైఫండ్‌ భారీగా పెంచుతూ..

Stipend : నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్, భారీగా స్టైఫండ్ పెంపు

Stipend

Stipend : తెలంగాణలో నర్సింగ్‌ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ కాలేజీల్లో జీఎన్‌ఎం, బీఎస్సీ, నర్సింగ్‌ కోర్సు చదువుతున్న విద్యార్థులకు స్టైఫండ్‌ భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు నర్సింగ్ విద్యార్థులకు రూ.1500లుగా ఉన్న స్టైఫండ్ ను ప్రభుత్వం మూడు రెట్లకు పెంచింది.

WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!

జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ నెలకు రూ. 1500లు ఉండగా రూ.5 వేలకు పెంచింది. సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు రూ.1700 నుంచి రూ. 6 వేలకు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ. 1900 నుంచి రూ.7వేలు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రూ.2,200 నుంచి రూ.8 వేలకు పెంచింది.

వీరితో పాటు ఎమ్మెస్సీ నర్సింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.9 వేలకు, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.10 వేలకు స్టైఫండ్‌ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Google Chrome Warn : క్రోమ్‌ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి!

జీఎన్ఎం నర్సింగ్
మొదటి సంవత్సరం విద్యార్థులకు 1500 నుంచి 5వేలకు పెంపు
సెకండ్ ఇయర్ విద్యార్థులకు 1700 నుంచి 6వేలకు పెంపు
థర్డ్ ఇయర్ విద్యార్థులకు 1900 నుంచి 7వేలకు పెంపు

బీఎస్సీ నర్సింగ్
ఫస్టియర్ విద్యార్థులకు 1500 నుంచి 5000 కు పెంపు
సెకండియర్ విద్యార్థులకు 1700 నుంచి 6000 కు పెంపు
థర్డ్ ఇయర్ విద్యార్థులకు 1900 నుంచి 7వేలకు పెంపు
ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు 2200 నుంచి 8వేలకు పెంపు

ఎమ్మెస్సీ నర్సింగ్
ఫస్టియర్ విద్యార్థులకు 9000
సెకండియర్ విద్యార్థులకు 10000