Kishan Reddy: కేంద్ర పథకాల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినప్పటికీ స్పందన లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Kishan Reddy: కేంద్ర పథకాల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy: తెలంగాణలో కేంద్ర పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినప్పటికీ స్పందన లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Nagpur: ప్రాణం తీసిన వయాగ్రా.. రెండు మాత్రలు వేసుకుని వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. తెలంగాణలో రైల్వే లైన్ల నిర్మాణానికి భూసేకరణ జరగడం లేదు. భూ సేకరణలో సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నాం. తెలంగాణలో కేంద్ర ప్రాజెక్టులకు సహకరించాలని ఇప్పటివరకు 11 లేఖలు రాశాం. కానీ తెలంగాణ నుంచి స్పందన లేదు.

Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేసిన నీఫియు రియో.. హాజరైన ప్రధాని మోదీ

కేంద్రాన్ని విమర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే మెట్రో ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. మెట్రో నిర్మాణం కోసం కేంద్రం రూ.1250 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదలయ్యాక అనేక చోట్ల మెట్రోను కేసీఆర్ అడ్డుకున్నారు. దీంతో ఎల్ అండ్ టీపై రూ.3 వేల కోట్ల అదనపు భారం పడింది. ఫలక్‌నుమా వరకు వెళ్లాల్సిన రైలును అఫ్జల్ గంజ్‌లో ఆపారు. బీఆర్ఎస్ మిత్రులైన ఎంఐఎం నేతల ఆస్తులు పోతున్నాయని పాత నగరం ప్రజలకు మెట్రో రాకుండా అన్యాయం చేశారు. ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపునకు కూడా తెలంగాణ సహకారం లేదు.

Telangana MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు.. 9న నామినేషన్లు దాఖలు

తెలంగాణలో గిరిజన మ్యూజియం ఏర్పాటు కోసం కేంద్రం రూ.కోటి మంజూరు చేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్థలం కేటాయించడం లేదు. ఎన్నిసార్లు దీనిపై లేఖలు రాసినా స్పందన లేదు. అనేక అంశాలపై విడివిడిగా లేఖలు రాసినా ఇప్పటివరకు సరైన స్పందన లేదు. తెలంగాణ అభివృద్దిపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు స్పందించరు? అబద్ధాలకు మారుపేరు కేటీఆర్. ఏ అంశంపై ఎవరు లేఖ రాసినా సమాధానం ఇవ్వాలని ప్రధాని మోదీ మాకు ఆదేశించారు. ప్రతి నెలా మాకు వచ్చిన లేఖలపై రివ్యూ చేస్తాం. కానీ, ఎన్ని లేఖలు రాసినా బదులిచ్చే సంస్కారం సీఎం కేసీఆర్‌కు లేదు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలని లేఖలో కోరాం’’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.