Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు అని తెలిపారు. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుంది. రూ.7వేల 521.80 కోట్లు పంపిణీ చేయనున్నారు.

Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

Rythu Bandhu

Rythu Bandhu : రైతుబంధు నిధుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంగళవారం(జూన్ 28) నుండి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రకటనలో సీఎం కేసీఆర్ కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. 68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు అని తెలిపారు. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుంది. రూ.7వేల 521.80 కోట్లు పంపిణీ చేయనున్నారు. రోజుకు ఒక ఎకరా నుండి ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇప్పటికే అర్హుల వివరాలను సీసీఎల్ఎ వ్యవసాయ శాఖకు అందించింది. ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థికశాఖకు అందించింది వ్యవసాయ శాఖ. వానాకాలం రైతుబంధు నిధుల పంపిణీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలి.

Telangana Marijuana : వారికి రైతు బంధు కట్… 148 మంది రైతులపై కేసులు

కేంద్రం ఎన్ని ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించినా రైతుల మీద అభిమానంతో రైతుబంధు నిధుల విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పత్తి, కంది, ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. జులై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Telangana Rythu Bandhu : ఈసారి రూ.7వేల 700కోట్లు.. రైతుబంధుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు

వర్షాలు కొంత ఆలస్యమైనందున తేలిక నేలల్లో 5 నుండి 6.5 సెంటీమీటర్లు, బరువు నేలల్లో 6 నుండి 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే రైతులు వర్షాధార పంటలను విత్తుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రేపటి నుండి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్న నేపథ్యంలో ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.