Government Jobs : తెలంగాణలో 86వేల ఉద్యోగాలు ఖాళీ, త్వరలో 55వేల పోస్టులు భర్తీ..!

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భ‌ర్తీ చేయనుంది. రాష్ట్రంలో అన్ని శాఖ‌ల్లో 86 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది.

Government Jobs : తెలంగాణలో 86వేల ఉద్యోగాలు ఖాళీ, త్వరలో 55వేల పోస్టులు భర్తీ..!

Government Jobs

Government Jobs : తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భ‌ర్తీ చేయనుంది. రాష్ట్రంలో అన్ని శాఖ‌ల్లో 86 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఇందులో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోను.. 55వేలకు పైగా పోస్టులను వరుస నోటిఫికేషన్లలో భర్తీ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇక నుంచి ఖాళీలు ఏర్పడ్డ 6 నెల‌ల్లో ఉద్యోగాలు భ‌ర్తీ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

Credit Debit Cards : క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త రూల్స్

ఉద్యోగుల విభజనలో భాగంగా నిన్న‌ కీలక సమావేశం జరిగింది. విభజన కమిటీ సమావేశానికి మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌, పశుసంవర్దక, స్త్రీ, శిశు సంక్షేమ, ఇరిగేషన్‌, వాణిజ్య పన్నుల అధికారులు హాజరై 16 శాఖల్లో 2వేల 500 మంది ఉద్యోగుల విభజన పూర్తి చేశారు. ఖాళీల గుర్తింపులో కీలకంగా కృషి చేసిన అధికారులు తుది నివేదికను రూపొందించారు. ఇందులో హోంశాఖలో 21వేల 507 పోస్టులు, విద్యా శాఖలో 22వేలు, వైద్యఆరోగ్య శాఖలో 10వేల 048 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలో 3వేల 538, గిరిజన సంక్షేమ శాఖలో 1700, గ్రామీణాభివృద్ధి శాఖలో 1391 పోస్టులు, ఇతర ఖాళీలతో కలుపుకుని మొత్తంగా 86వేల 747 ఖాళీలు ఉన్నట్లు అధికారులు తమ నివేదికలో తెలిపారు.

Mustard Oil : ఆవ నూనెతో వంట…బరువు తగ్గటం సులువు

ఈ నివేదికను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ.. మంత్రివర్గ ఆమోదానికి పంపింది. ఈ ఫైల్‌పై కేబినెట్‌ ఆమోదం తర్వాత జరిపే భర్తీలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను మినహాయించి ప్రత్యక్ష నియామకాల ద్వారా ఏర్పడిన 55వేలకు పైగా ఉద్యోగాల భర్తీ దిశగా యోచిస్తోంది. ఈ దిశలో ప్రభుత్వ విభాగాలు, సర్వీస్‌ రూల్స్‌, రోస్టర్‌, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను, నియామక రూల్స్‌ వంటి వాటిని ఆయా నియామక ఏజెన్సీలకు అందించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఒకదాని వెంట ఒకటి 55వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని యోచిస్తోంది.

ఇకపై ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసుకునేలా నెలవారీ క్యాలెండర్‌ రూపొందించే దిశగా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఖాళీలు ఏర్పడ్డ ఆరు నెలల్లోగా నియామకాలు పూర్తయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ తయారు చేస్తోంది.