Grameena Bank Robbery Case : బ్యాంకు చోరీ కేసు.. బంగారాన్ని రికవరీ చేయడం సాధ్యమేనా? రైతుల్లో తీవ్ర ఆందోళన

దొంగలు దొరుకుతారా? ఎప్పటికి దొరుకుతారు? అప్పటికి ఎన్ని నగలు ఉంటాయి? ఎన్ని అమ్మేస్తారు? వాటన్నింటి రికవరీ చేయడం సాధ్యమేనా? తిరిగి రైతులకు నిజంగా వారు దాచుకున్న నగలనే ముట్టజెప్పగలరా? (Grameena Bank Robbery Case)

Grameena Bank Robbery Case : బ్యాంకు చోరీ కేసు.. బంగారాన్ని రికవరీ చేయడం సాధ్యమేనా? రైతుల్లో తీవ్ర ఆందోళన

Grameena Bank Robbery Case

Grameena Bank Robbery Case : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లో 44వ జాతీయ రహదారిపై ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. సినీ ఫక్కీలో బ్యాంకుకి కన్నమేశారు దొంగలు. అచ్చం జులాయి సినిమా తరహాలో గ్యాస్‌ కట్టర్లతో బ్యాంకు లాకర్‌ను ధ్వంసం చేసిన దొంగలు రూ.4.46 కోట్ల విలువైన సొమ్ము దోచుకెళ్లారు. గ్రామాభివృద్ధి కమిటీ భవనంపై అంతస్తులో ఉన్న బ్యాంకు తాళాలు తొలగించి దొంగలులోనికి ప్రవేశించారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్లతో కట్టర్లను వినియోగించి స్ట్రాంగ్‌రూం తాళాలు తొలగించారు. బ్యాంకులో రెండు లాకర్లుండగా తాకట్టు బంగారం ఉంచిన పెద్ద లాకర్‌ను ధ్వంసం చేశారు.(Grameena Bank Robbery Case)

Bank Robbery : జులాయి సినిమా తరహాలోనే.. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకులో భారీ చోరీ

ఇందులో రూ.7.30 లక్షల నగదు, 8.3 కిలోల బంగారు ఆభరణాలు(విలువ నాలుగు కోట్లు), విలువైన ఫైల్స్ ఉన్నాయి. గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ తలుపును కోసే క్రమంలో నిప్పురవ్వల కారణంగా కొంత నగదు, ఫైల్స్ కాలి బూడదయ్యాయి. దొంగలు వెంటతెచ్చిన గ్యాస్‌ సిలెండర్లు అక్కడే వదిలేసి బంగారంతో పరారయ్యారు. ఎటువంటి ఆధారాలు దొరక్కుండా దొంగలు ఎంతో తెలివిగా వ్యవహరించారు. సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి వీడియో రికార్డు జరిగే డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. ఎలుగుబంటి రూపంలో ఉండే మాస్కులు ధరించి వచ్చిన దొంగలు బ్యాంకు ఆవరణలో ఓ మాస్క్‌ వదిలి వెళ్లారు. కాగా, ఖాతాదారుల ఆభరణాల లాకర్‌కు ఏమీ కాకపోవటంతో మరింత భారీ చోరీ తప్పినట్లయింది.

బ్యాంకులో భారీ చోరీతో నగదు, నగలు దాచుకున్న ఖాతాదారులు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ బంగారం రికవరీ అవుతుందో లేదోనని కంగారుపడుతున్నారు.(Grameena Bank Robbery Case)

Bussapur Bank Robbery : ప్రొఫెషనల్ దొంగల పనే..! బుస్సాపూర్ బ్యాంకు చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం

బ్యాంకు చోరీ కేసులో దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నగలను రికవరీ చేస్తామని అంటున్నారు. బ్యాంకు అధికారులు సైతం పోలీసులనే నమ్ముకున్నారు. కానీ అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్ దొంగలు దొరుకుతారా? పట్టుబడతారు అనుకున్నా ఎప్పటికి దొరుకుతారు? అప్పటికి ఎన్ని నగలు ఉంటాయి? ఎన్ని అమ్మేస్తారు? వాటన్నింటి రికవరీ చేయడం సాధ్యమేనా? తిరిగి రైతులకు నిజంగా వారు దాచుకున్న నగలనే ముట్టజెప్పగలరా? లేకపోతే ఆ నగల విలువ మేరకు వేరే నగలను, బంగారము అప్పజెబుతారా? ఇవన్నీ ప్రశ్నలే. ఈ తంతు నడిచే సరికి చాలా కాలమే పట్టొచ్చు.(Grameena Bank Robbery Case)

అంతా పకడ్బందీగా సినీ ఫక్కీలో బ్యాంకులో దొంగతనం జరిగిపోయింది. జులాయి, మోసగాళ్లకు మోసగాడు సినిమా స్టైల్ లో గ్యాస్ కట్టర్లతో వచ్చిన దొంగగలు.. ఏకంగా నాలుగున్నర కోట్ల సొమ్ము దోచుకెళ్లారు. దొంగతనం జరిగిన విధానం చూస్తుంటే ఒకటి రెండు రోజులు కాదు చాలా రోజులుగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు డౌట్ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్ లో జన సామర్ధ్యం తక్కువగా ఉన్న ప్రదేశాన్ని దొంగలు చోరీ చేయడానికి అనువైనదిగా సెలక్ట్ చేసుకున్నారు. బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు భారీ చోరీకి పాల్పడ్డారు.

ముందుగా బ్యాంక్‌ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్ సాయంతో బ్యాంక్‌ షట్టర్‌ని కట్ చేసి తెరిచారు. అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమును గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోపలికి చొరబడ్డారు. లాకర్లలో ఉన్న 7 ల‌క్ష‌ల 30 వేల రూపాయ‌ల‌ నగదు, 8.3 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లిన బంగారు నగల విలువ 4 కోట్లు ఉంటుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ చోరీ అంతా శనివారం రాత్రి జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. లాకర్ ను కట్ చేసే క్రమంలో నిప్పురవ్వలు పడి లాకర్‌లో దాచిన కొంత నగదు, విలువైన పత్రాలు సైతం కాలి బూడదయ్యాయి.(Grameena Bank Robbery Case)

బ్యాంకులోని అలారం సెన్సార్‌ శబ్ధం రాకుండా దాన్ని కూడా ధ్వంసం చేయడం, సీసీ కెమెరాకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డును సైతం ఎత్తుకెళ్లడం.. ఇవన్నీ చూస్తుంటే.. పక్కా స్కెచ్ తోనే దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. చిన్న క్లూ కూడా దొరక్కుండా కోట్లు కొల్లగొట్టిన వైనం పోలీసులనే విస్మయానికి గురి చేస్తోంది. బ్యాంకులో చోరీ జరిగిన తీరు గమనిస్తే.. ఇది అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. ఎక్క‌డా అనుమానం, శబ్దం రాకుండా గ్యాస్ క‌ట్టర్‌తో లాక‌ర్‌ను తెరవడం, ముఖాలు గుర్తు పట్టకుండా మాస్క్‌లతో రావడం.. అంతా పక్కా సినిమాటిక్ స్టైల్లో ఉందని పోలీసులు అంటున్నారు.(Grameena Bank Robbery Case)