TSPSC Group 4: తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారు.. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు
తాజా గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా 9,168 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. గత డిసెంబర్‌లో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. మొదట దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 30 తుది గడువుగా నిర్ణయించింది టీఎస్‌పీఎస్‌సీ.

TSPSC Group 4: టీఎస్‌పీఎస్‌సీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారైంది. వచ్చే జూలై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
NSA Ajit Doval: అమెరికా సెక్రటరీతో అజిత్ ధోవల్ భేటీ.. రక్షణ రంగ సహకారంపై చర్చ
తాజా గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా 9,168 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. గత డిసెంబర్‌లో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. మొదట దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 30 తుది గడువుగా నిర్ణయించింది టీఎస్‌పీఎస్‌సీ. అయితే, మరికొందరు దరఖాస్తుదారుల ఇబ్బందుల్ని, అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. తాజా దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగించింది. దీంతో రేపటితో గ్రూప్-4 దరఖాస్తు గడువు ముగియనుంది.
ఇప్పటికే దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దరఖాస్తుకు మరో రోజు గడువు ఉన్నందున ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఈసారి భారీ స్థాయిలో గ్రూప్-4కు అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్-1 పరీక్షల తేదీల్ని కూడా టీఎస్‌పీఎస్‌సీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.