మార్చి 16నుంచి ఒంటిపూట.. ఏప్రిల్ 24నుంచి సెలవులు

మార్చి 16నుంచి ఒంటిపూట.. ఏప్రిల్ 24నుంచి సెలవులు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు.. ఇతర అన్ని యజమాన్యాలన్నింటికీ ఒంటి పూట బడులు, వేసవికాలం సెలవులు ఫిక్సయిపోయాయి. వచ్చే సోమవారం అంటే మార్చి 16నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తారని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా కమిషనర్ చిత్రా రామ్ చంద్రన్ ప్రకటించారు. 

వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో 16నుంచి ఒంటి పూటబడులను కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల వరకూ పాఠశాలలు కొనసాగించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

See Also | కరోనాపై యుద్ధం గెలిచిన తెలంగాణ ప్రభుత్వం

మధ్యాహ్న భోజనాన్ని 12గంటల 30నిమిషాలకు పెట్టాలని పేర్కొన్నారు. పాఠశాలలకు వచ్చే నెల (ఏప్రిల్)23వ తేదీ నుంచి వేసవి సెలవులు వర్తిస్తాయని వెల్లడించారు. తిరిగి పాఠశాలలు(కొత్త విద్యా సంవత్సరం) జూన్ 12నుంచి ప్రారంభం అవుతాయని అన్నారు. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలు ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలలకు పంపాలని సూచించారు.