జలశిరులను పొంగిస్తూ..హరిత, నీలి, గులాబీ విప్లవాలను తెచ్చాం : మంత్రి కేటీఆర్

  • Published By: nagamani ,Published On : June 10, 2020 / 07:29 AM IST
జలశిరులను పొంగిస్తూ..హరిత, నీలి, గులాబీ విప్లవాలను తెచ్చాం : మంత్రి కేటీఆర్

తెలంగాణలో జల శిరులు పొంగిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్ మదనకల్ వద్ద గోదావరి జలాలలకు హారతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో జలశిరులు పొంగిస్తున్నామని..వేలాది హెక్టార్లలలో పంటలు పండిచేందుకు ఈ జలాలు ఉపయోగపడుతున్నాయనీ..రాష్ట్రంలో నీరు.నీలి, హరిత, గులాబీ విప్లవాలు తీసుకొచ్చామని తెలిపారు. 

అంతేకాదు రైతులకు పాడి గేదెలు..గొర్రెలు,మేకలు పంపిణీ చేస్తు రైతన్నలకు బాసటగా నిలుస్తున్నామని..గేదెల ద్వారా ఆదాయం పెరగటానికి పాలు లీటర్కు రూ.4లు పెంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులు కూడా ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న పంటల్ని వేస్తూ తమ ఆదాయాలను పెంచుకోవాలని మార్కెట్ లో ఏపంటలకు గిరాకీ ఎక్కువగా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తమ ఆదాయాలను పెంచుకోవాలని సూచించారు. 

బీడుబారిపోయిన తెలంగాణ బీముల్లో నీటిని పారించిన అపరభగీరథుడు  మన సీఎం కేసీఆర్ అని..రైతుల సంక్షేమమే పరమావధి పాలిస్తున్న అటువంటి వ్యక్తి మనకు సీఎం కావటం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. రాష్ట్రంలో జలశిరులు పొంగుతుంటే తెలంగాణ రైతుల గుండెలు సంతోషంతో పొంగిపోతున్నాయని..అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నేతలు జలదీక్షలు చేస్తామంటు  అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారనీ..ఎద్దేవా చేశారు. వారు అధికారంలోఉన్నన్ని సంవత్సరాలు ఎప్పుడైనా తెలంగాణలో ప్రాజెక్టుల గురించి గానీ..నీటి సమస్యల గురించి గానీ ఆలోచించిన పాపాన పోలేదనీ..అటువంటి కాంగ్రెస్ పార్టీవోళ్లు ఇప్పడు జలదీక్షలు చేస్తామని అనటం హాస్యాస్పదమని విమర్శించారు కేటీఆర్.

ప్రజల్ని మభ్యపెడతామనుకుంటున్నా ఇటువంటి గుంటనక్కల్ని ఏమాత్రం నమ్మవద్దని అభివృద్ది..సంక్షేమ బాటలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రం..బంగారు తెలంగాణాగా మారుతుంటే వీరు సహించలేక పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. 

Read: ప్లాస్మాతో పునర్జన్మ, కరోనాతో చావు అంచుల వరకు వెళ్లి 16 రోజుల్లో కోలుకున్న వంశీ