Telangana Covid : తెలంగాణలో కరోనా.. కొత్త కేసులు
ఎవరూ కోవిడ్ బారిన పడి మరణించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4 వేల 111గా ఉంది. ఒక్క రోజులోనే…20 మంది డిశ్చార్జ్...

Revised Media Bulletin : భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమౌతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుందనే నిపుణుల హెచ్చరికలతో ఆయా రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. మళ్లీ నిబంధనలు పెడుతున్నాయి. మాస్క్ కంపల్సరీ అని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి ఫుల్ స్టాప్ పడడం లేదు. కంటిన్యూగా కేసులు రికార్డవుతున్నాయి.
Read More : Corona Virus : మూడేళ్లైనా కరోనా వైరస్ గురించి అంతుచిక్కడం లేదు
అయితే..కొద్ది కొద్దిగా కేసులు తగ్గుతుండడం ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 34 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎవరూ కోవిడ్ బారిన పడి మరణించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4 వేల 111గా ఉంది. ఒక్క రోజులోనే…20 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా..7,87,581 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 14,243 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 3,46,34,887 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Read More : Coronavirus China: షాంఘైను వీడుతున్నరు.. పెరుగుతున్న కొవిడ్ కేసులతో ఇతర ప్రాంతాలకు ప్రజలు..
ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 0. భద్రాద్రి కొత్తగూడెం 0. జీహెచ్ఎంసీ 26. జగిత్యాల 0. జనగామ 00. జయశంకర్ భూపాలపల్లి 0. జోగులాంబ గద్వాల 1. కామారెడ్డి 0. కరీంనగర్ 2. ఖమ్మం 0. కొమరం భీం ఆసిఫాబాద్ 0. మహబూబ్ నగర్ 0. మహబూబాబాద్ 0. మంచిర్యాల 0. మెదక్ 0. మేడ్చల్ మల్కాజ్ గిరి 0. ములుగు 0. నాగర్ కర్నూలు 0. నల్గొండ 0. నారాయణపేట్ 0. నిర్మల్ 0. నిజామాబాద్ 0. పెద్దపల్లి 0. రాజన్న సిరిసిల్ల 0 రంగారెడ్డి 4. సంగారెడ్డి 1. సిద్ధిపేట 0. సూర్యాపేట 0. వికారాబాద్ 0. వనపర్తి 0. వరంగల్ రూరల్ 0. హన్మకొండ 0. యాదాద్రి భువనగిరి 0. మొత్తం : 34