Telangana : దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన రాష్ట్రంగా తెలంగాణ

ఒకప్పుడు వర్షాల కోసం ఆతృతుగా ఎదురుచూసే తెలంగాణలో.. ఈ ఏడాది కుండపోత వర్షం కురిసింది. వర్షాలు పడాలని దేవుళ్లకు ప్రార్థనలు చేసే స్థాయి నుంచి పడ్డ వానలు ఇక చాలు అనే స్థాయికి చేరుకుంది.

Telangana : దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన రాష్ట్రంగా తెలంగాణ

Telangana (5)

highest rainfall in Telangana : ఒకప్పుడు వర్షాల కోసం ఆతృతుగా ఎదురుచూసే తెలంగాణలో.. ఈ ఏడాది కుండపోత వర్షం కురిసింది. వర్షాలు పడాలని దేవుళ్లకు ప్రార్థనాలు చేసే స్థాయి నుంచి పడ్డ వానలు ఇక చాలు బాబోయ్‌ అనే స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ నిండుకుండలా మారింది. సాధారణంగా కంటే ఈ ఏడాది తెలంగాణలో 31 శాతం వానలు అధికంగా పడినట్లు ఇండియా మెటలార్జికల్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో కంటే తెలంగాణలోనే ఎక్కువగా వర్షాలు కురిశాయి. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 20 దాకా 920.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగానైతే 701.2 వర్షపాతం నమోదవుతుంది. అంటే ఈ సారి సుమారు సాధారణం కంటే 200 మిల్లిమీటర్లు వర్షపాతం అధికంగా నమోదైంది. వర్షకాల సమయం దాటుతున్నప్పటికీ దేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో వర్షాలు పడ్డాయని IMD తెలిపింది.

Heavy Rains : తెలంగాణాలో మూడురోజులు భారీ వర్షాలు

ఇందులో అత్యధికంగా వర్షాలు పడ్డా రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉంది. తెలంగాణ తర్వాత మరట్వాడా, రాయలసీమ, కర్నాటక, పశ్చిమబెంగల్‌, హర్యానా, చండీఘడ్‌, ఢిల్లీ, కొంకన్ , గోవా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో వర్షాలు పడడం ఇదే మొదటిసారని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా తెలంగాణ నిండుకుండలా మారింది. అక్కడక్కడ వరదలు ముంచెత్తాయని చెప్పారు. అయితే గతేడాది వర్షకాలంలో 48 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి.. కానీ అప్పుడు గుజరాత్‌లోని సురాష్ట్ర ప్రాంతం 126 శాతం అత్యధిక వర్షపాతంతో రికార్డ్‌ సృష్టించింది.