Sharmila padayatra..HC ermission : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..షరతులు వర్తిస్తాయని సూచించిన ధర్మాసనం

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కానీ షరతులు వర్తిస్తాయని సూచింది. షరతులకు లోబడే పాదయాత్ర కొనసాగించుకోవచ్చని వెల్లడించింది ధర్మాసనం. గతంలో విధించిన షరతులు వర్తిస్తాయని..వాటిని గుర్తుంచుకోవాలని స్పష్టంచేసింది.

Sharmila padayatra..HC ermission : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..షరతులు వర్తిస్తాయని సూచించిన ధర్మాసనం

Sharmila padayatra..HC ermission

Sharmila padayatra..HC ermission : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కానీ షరతులు వర్తిస్తాయని సూచింది. షరతులకు లోబడే పాదయాత్ర కొనసాగించుకోవచ్చని వెల్లడించింది ధర్మాసనం. గతంలో విధించిన షరతులు వర్తిస్తాయని..వాటిని గుర్తుంచుకోవాలని స్పష్టంచేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం తెలంగాణ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు అనుమతి ఇచ్చాక పోలీసులు అనుమతిని ఎలా నిరాకరిస్తారు?అని ప్రశ్నించిన ధర్మాసనం పాదయాత్రల కోసం రాజకీయ నాయకులంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

కాగా పాదయాత్రలో షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిపై పార్టీ నేతలు కూడా అదే రీతిలో సమాధానం ఇచ్చారు. ఇలా తెలంగాణ ప్రభుత్వానికి షర్మిలకు మధ్యా మాటల తూటాలు పేలాయి. అవినీతి ప్రభుత్వం. కుటుంబ పాలన అంటూ షర్మిల విరుచుకపడితే గులాబీ నేతలు కూడా ఏమీ తక్కువకాకుండా ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో షర్మిల పాదయాత్రలో భాగంగా వరంగల్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల కారవాన్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. ఈ ఘటనను నిరసిస్తూ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వటం..కారులో తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటు రావటం ఈ సందర్భంగా షర్మిలను అరెస్ట్ చేయటం వంటి పరిణామలు తీవ్రతరమయ్యాయి. ఈక్రమంలో షర్మిల పాదయాత్రకు ఆటకం కల్పించారు పోలీసులు.

తన పాదయాత్రను కుట్రపూరితంగ అడ్డుకుంటున్నారని అనుమతి ఇచ్చేంత వరకు ఆమరణనిరాహార దీక్ష చేస్తానంటూ దీక్షకు కూర్చున్నారు. మరోపక్క తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు షర్మిల. దీనికి హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. కానీ శాంతి భద్రతలు వస్తాయని వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈక్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాదయాత్రకు తాము అనుమతిని ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా నిరాకరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.

కాగా పాదయాత్రను అనుమతి ఇచ్చిన కోర్టు ..యాత్రలో రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సూచించింది. పాదయాత్రకు సంబంధించి ఇరువైపు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ రావడంతో వైఎస్సార్టీపీ శ్రేణుల్లో సంతోషం నెలకొంది.