Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. 27న హన్మకొండలో భారీ సభ

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే యాత్ర కొనసాగించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. స్టేషన్ ఘన్‌పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది.

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. పాదయాత్ర ఆపాలని బండి సంజయ్‪కు పోలీసులు ఇచ్చిన నోటీసును హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంపై గురువారం విచారణ జరిపిన కోర్టు, సాయంత్రం తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం, బండి సంజయ్ తరఫు లాయర్లు కేసులో తమ వాదనలు వినిపించారు.

Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్.. ఉద్రిక్తత మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు

బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను ఉదయం పెన్‌డ్రైవ్‌లో సమర్పించింది ప్రభుత్వం. అయితే, పెన్‌డ్రైవ్‌ ఆధారాలు కోర్టులో చెల్లవని కోర్టు వ్యాఖ్యానించింది. డాక్యుమెంట్ల రూపంలో ఆధారాలు సమర్పించకపోవడంపై ప్రభుత్వం, పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు యాత్రకు అనుమతి తీసుకున్నారా అని బండి సంజయ్ తరఫు లాయర్లను కోర్టు ప్రశ్నించింది. అయితే, తాము యాత్రకు ముందుగానే అనుమతి తీసుకున్నామని, పాదయాత్ర జరిగే ప్రతి కమిషనరేట్ పరిధిలో అనుమతి తీసుకున్నట్లు బండి తరఫు లాయర్లు చెప్పారు.

Arvind Kejriwal: ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.800 కోట్లు కేటాయించిన బీజేపీ: అరవింద్ కేజ్రీవాల్

‘‘బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు సరైన ఆధారాలు చూపించలేదు. ఎక్కడ, ఎలాంటి వ్యాఖ్యలు చేశారో పోలీసులు నిరూపించలేకపోయారు. సరైన సాక్ష్యాలు చూపకపోవడంతో కోర్టు.. బండి సంజయ్ యాత్రకు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే కోర్టు యాత్రకు అనుమతించింది’’ అని బండి సంజయ్ తరఫు లాయర్ రచనా రెడ్డి చెప్పారు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బండి సంజయ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. స్టేషన్ ఘన్‌పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది. ఈ నెల 27న యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కూడా జరగబోతుంది.

 

ట్రెండింగ్ వార్తలు