Viveka Case: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట.. హైకోర్టు వద్దకు కేఏ పాల్
వైఎస్ వివేకా కేసులో అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

MP Avinash Reddy Gets Bail In YS Viveka Case
Viveka Case: వైఎస్ వివేకా కేసు (YS Viveka case)లో అవినాశ్ రెడ్డి (Avinash Reddy) కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో ఊరట లభించింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ బుధవారం తుదితీర్పు వెలువరించింది. అవినాశ్ రెడ్డి లాయర్ వాదనలు పరిగణలోకి తీసుకున్నకోర్టు.. అతనికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, సీబీఐ (CBI) అధికారులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఇదిలాఉంటే హైకోర్టు వద్దకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ చేరుకున్నారు. అవినాశ్ రెడ్డి తీర్పు కోసం వచ్చానని కేఏ పాల్ చెప్పడం గమనార్హం.
YS Viveka Case: అప్పటివరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయొద్దు: తెలంగాణ హైకోర్టు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అవినాశ్ రెడ్డిని గతంలో పలుసార్లు విచారించింది. అయితే, ఇటీవల పలుసార్లు విచారణకు రావాలని సీబీఐ అవినాశ్‌కు నోటీసులు ఇవ్వగా పలు కారణాలతో విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేనని అవినాశ్ సీబీఐకి లేఖ రాసిన విషయం విధితమే. దీనికితోడు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ పిటిషన్ పై విచారణ అనేక మలుపులు తిరిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఇటీవల అవినాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో హైకోర్టుకు సీబీఐ అవినాశ్ గురించి పలు కీలక విషయాలు తెలిపింది. విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించడం లేదని చెప్పింది.
YS Viveka Case : దర్యాప్తు మా పద్ధతిలోనే చేస్తాం..అవినాశ్ రెడ్డి కోరుకున్నట్లుగా కాదు : సీబీఐ
విచారణను తమ పద్ధతిలో చేస్తామని, అంతేగాని అవినాశ్ రెడ్డి కోరుకున్నట్లుగా చేయబోమని పేర్కొంది. సీబీఐ, అవినాశ్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు అవినాశ్ పిటిషన్‌పై 31న తీర్పు ప్రకటిస్తామని తెలిపింది. ఈ క్రమంలో బుధవారం అవినాశ్ రెడ్డి లాయర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. వివేకా కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని తెలిపింది.