High Court : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏజీ వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి కలుగజేసుకున్నారు. మన ఇంట్లో పిల్లలు పరీక్ష రాస్తే ఆ బాధ తెలుస్తుందని, పరీక్షలు రద్దు చేసి మంచి పని చేశారని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు.

High Court : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

High Court

High Court : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీల సహకారం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అయితే పేపర్ లీకేజీ తెలంగాణలోనే కొత్తగా జరుగలేదని చాలా రాష్ట్రాల్లో జరుగుతుందని ఏజీ వాదనలు వినిపించారు. ఏజీ వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి కలుగజేసుకున్నారు. మన ఇంట్లో పిల్లలు పరీక్ష రాస్తే ఆ బాధ తెలుస్తుందని, పరీక్షలు రద్దు చేసి మంచి పని చేశారని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు.

పేపర్ లీక్ పై సీబీఐతో విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్న ఏజీ రిపోర్టు రావాల్సి ఉందన్నారు. అయితే సిట్ తూతూ మంత్రంగా విచారణ చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇక దీనిపై విచారించిన హైకోర్టు సిట్ చీఫ్ పేరేంటి? సిట్ లో ఎవరైనా టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ ఉన్నారా? సిట్ లో ఉన్న సభ్యులు ఎవరు? అని ఏజీని ప్రశ్నించింది.

TSPSC : పేపరు లీకు కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన టీఎస్పీఎస్సీ

సీబీఐ విచారణ జరిపించాలని దాఖలు చేసిన పిటిషన్ పై ఏప్రిల్ 28న హైకోర్టు తీర్పు ఇ్వవనుంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. పేపర్ లీకేజీ కేసులో అడిషనల్ నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించింది. హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ కీలక అంశాలు పేర్కొంది. పేపర్ లీకేజీ కేస్ లో రాజశేఖర్ బావ ప్రశాంత్ ను ఏ-16 గా చేర్చింది.

ప్రశాంత్ ఇంకా పరారిలో ఉన్నారని, ప్రశాంత్ పారి పోయి న్యూజిలాండ్ లో ఉన్నారని సిట్ తెలిపింది. 40 మంది సాక్షులను విచారించామని పేర్కొంది. ఏఈ పేపర్ ద్వారా రూ.31 లక్షలు కలెక్ట్ చేశారని వెల్లడించింది. అన్ని పేపర్ లు కలిపి రూ.42 లక్షలు లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. దాక్యా బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.4 లక్షలు సిట్ ఫ్రీజ్ చేసింది.

YS Sharmila : టీఎస్పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని.. గవర్నర్ తమిళిసైకి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

మార్చి 28న ప్రవీణ్ మామ సిట్ కార్యాలయానికి వచ్చి రూ.3 లక్షలు ఇచ్చాడని తెలిపింది. 379 సెక్షన్ ను సిట్ అదనంగా యాడ్ చేసింది. విచారణ సందర్భంగా కీలక ఆధారాలు సేకరించామని వెల్లడించింది. సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ కు పంపామని పేర్కొంది. సెంట్రల్ ఫోరెన్సిక్ నుండి రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపింది.