Telangana Republic Day : రిపబ్లిక్ డే వేడుకలు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. కోవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను ఆపడం సరికాదంటూ తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Telangana Republic Day : రిపబ్లిక్ డే వేడుకలు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana Republic Day : తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. కోవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను ఆపడం సరికాదంటూ తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. గణతంత్ర వేడుకలను అధికారికంగా నిర్వహించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

యావత్ భారతదేశం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోబోతోంది. తెలంగాణలో మాత్రం.. ప్రభుత్వం నుంచి గణతంత్ర వేడుకల నిర్వహణకు సంబంధించి ఎలాంటి స్పందన లేదు. అసలు వేడుకలను నిర్వహిస్తున్నారా? లేదా? అనే విషయంలో సైతం సందిగ్ధత నెలకొంది.

Also Read..Republic Day Parade: గణతంత్ర దినోత్సవ పరేడ్‭కు పంజాబ్ శకటాన్ని తిరస్కరించిన కేంద్రం

ఈ పరిస్థితుల్లో తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పరేడ్ తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను ఎక్కడ నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలని కోర్టు తెలిపింది.

జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సర్క్యూలర్ పపించింది. ఆ వేడుకల్లో విద్యార్థులను భాగస్వాములు చేయాలని కోరింది. అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించిందని, తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను అధికారికంగా నిర్వహించకపోవటంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవి ధర్మాసనం విచారణ చేసి కీలక తీర్పును వెలువరించారు.

Also Read..US Files : అమెరికాలో అలా..భారత్‌లో ఎందుకిలా? ప్రతిపక్ష నేతలపై జరిగే దర్యాప్తు సంస్థల దాడులు అధికారంలో ఉన్నవారిని ఎందుకు టచ్ చేయవు? కారణం అదేనా?..

రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలను అధికారికంగా నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాలంది. రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు త్వరగా చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పిటిషన్ పై విచారణ సందర్భంగా.. కరోనా వల్ల రెండేళ్లుగా పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహించలేదని.. ఏజీ సమాధానమిచ్చారు. కాగా.. 5 లక్షల మందితో నిర్వహించిన సభకు లేని కోవిడ్ నిబంధనలు.. రిపబ్లిక్ డే వేడుకలకు మాత్రమే వర్తిస్తాయా అంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిపబ్లిక్ వేడుకలు జాతీయ భావం పెంపొందించడానికే అన్నారు.