Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ

తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరలపై హైకోర్టులో విచారణ జరిపింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.

Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ

Telangana High Court

Telangana High Court : తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరలపై హైకోర్టులో విచారణ జరిపింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. ఈ సందర్భంగా.. టికెట్ల ధరలు నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటు చేసినట్టు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు.

ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనలు తెలంగాణ ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు ప్రభుత్వ తరుపు న్యాయవాది స్పష్టం చేయగా.. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇచ్చిన గడువులోగా ప్రభుత్వ నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పాల్సిందేనని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఇదే విషయమై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోంశాఖ సెక్రెటరీల‌ను ఆదేశించింది హైకోర్టు.

రెండేళ్ల నుంచి కరోనా కారణంగా సినిమా థియేటర్లలో సరిగ్గా సినిమాలు లేక తీవ్ర నష్టాల్లో ఉన్నాయి యాజమాన్యాలు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో జూలై 30 నుంచి థియేటర్లలో బొమ్మ పడబోతుంది.

అయితే, ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కొత్త సినిమాలు లేకపోవడం.. ఓటీటీల్లోనే కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉండడంతో థియేటర్స్ యాజమానులకు నష్టం తప్పట్లేదు. ఈ క్రమంలోనే రాబోయే కొత్త సినిమాలకు మాత్రం టిక్కెట్ రేట్లను పెంచుకునే ఆలోచనలో థియేటర్లు ఉన్నాయి.