T.HC Unlock : ఆ రెండు జిల్లాలు తప్ప కోర్టుల్లో అన్‌లాక్ షురూ..

ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి తగ్గడంతో న్యాయస్థానాల్లో అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది.

T.HC Unlock : ఆ రెండు జిల్లాలు తప్ప కోర్టుల్లో అన్‌లాక్ షురూ..

High Court Starts Unlock Process

High Court Starts Unlock Process: లాక్‌డౌన్. అన్నీ మూత పడ్డాయి. విద్యాసంస్థలతో సహా న్యాయస్థానాలు కూడా మూతపడ్డాయి. కేసుల విచారణలు అన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో న్యాయస్థానాల అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంభంధించి తెలంగాణ హైకోర్టు ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. అన్ లాక్ చేసి ఇకనుంచి కేసుల విచారణలు కోర్టులోనే జరిగేలా చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా తెలంగాణలోని రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కోర్టులు పూర్తిస్థాయిలో ప్రారంభించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 19 నుంచి పాక్షిక విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి తగ్గడంతో న్యాయస్థానాల్లో అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ రోజు విడిచి రోజు హాజరవుతున్న సిబ్బంది ఇక నుంచి అంటే జులై 19 నుంచి సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. 19 నుంచి కోర్టుల్లోనే పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ఉంటుందని తెలిపింది. అలా ఆదిలాబాద్,నిజామాబాద్ జిల్లా కోర్టుల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లోను విచారణ కోర్టులోనే చేయాలని ఆదేశించింది.

హైకోర్టుతో పాటు మిగతా ఉమ్మడి జిల్లాల్లో జులై 31 వరకు మాత్రమే కేసుల విచారణ ఆన్ లైన్ లో కొనసాగుతుందని..ఆ తరువాత కోర్టుల్లోనే విచారణ జరగాలని ఆదేశించింది. ఇప్పటి వరకు కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా రోజు విడిచి రోజు పరిమిత సంఖ్యలో సిబ్బంది మాత్రమే హాజరవుతున్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సిబ్బంది హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.