BJP National Executive Meeting : బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణా ఇంటెలిజెన్స్ పోలీసులు

హైదరాబాద్ హెచ్ఐసీసీ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈసమావేశాల్లో భాగంగా ఆదివారం రెండో రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ రోజు మూడు తీర్మానాలు చేశారు.

BJP National Executive Meeting : బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణా ఇంటెలిజెన్స్  పోలీసులు

Indrasena Reddy

BJP National Executive Meeting :  హైదరాబాద్ హెచ్ఐసీసీ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈసమావేశాల్లో భాగంగా ఆదివారం రెండో రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ రోజు మూడు తీర్మానాలు చేశారు.

కాగా…ఆదివారం సమావేశాలు జరుగుతున్న ప్రాంగణంలో కలకలం రేగింది. తెలంగాణ ఇంటిలిజెన్స్ కు చెందిన అధికారి శ్రీనివాస రావు పోలీసు పాస్ తీసుకుని సమావేశం హాల్లోకి ప్రవేశించారు. అక్కడ ఆయన్ను బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి గుర్తంచి అడ్డుకున్నారు. అప్పటికే శ్రీనివాసరావు సెల్ ఫోన్ లో తీసిన బీజేపీ రాజకీయ తీర్మానాల కాపీలను డిలీట్ చేయించి… పోలీసు కమీషనర్ కు అప్పగించారు.

బీజేపీ సమావేశాలను చూసి  ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడు తనానికి పాల్పడుతోందని ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఏ పార్టీ ప్రైవసీ ఆ పార్టీకి ఉంటుందని… ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చేయాలి గానీ ఇలా చేయటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read : PM Modi Meeting: విజయ సంకల్ప సభ భారీ కవరేజ్‌కు కమలనాథుల ప్రణాళిక.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ప్లాన్