దసరా 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులే సెలవులు, Inter అకడమిక్ కేలండర్

  • Published By: madhu ,Published On : September 11, 2020 / 07:57 AM IST
దసరా 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులే సెలవులు, Inter అకడమిక్ కేలండర్

కరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమవుతోంది. ఇంటర్ మీడియట్ తరగతులు, పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. కరోనాతో పని దినాలు చాలా కోల్పోయాయి. మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ..కరోనా కారణంగా..2021 మార్చిలో ఆలస్యంగా వార్షిక పరీక్షలను నిర్వహంచేలా షెడ్యూల్ ను ప్రకటించింది. అకడమిక్ కేలండర్ ను విడుదల చేసింది.



Exams

Exams




ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు (దూరదర్శన్, టీశాట్‌ ద్వారా వీడియో పాఠాలు) ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాలేజీల పనిదినాలు, ఏయే నెలలో ఏయే రోజుల్లో కాలేజీలను కొనసాగించే అంశాలతో షెడ్యూల్‌ జారీ చేసింది. 2021, మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకు పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
https://10tv.in/coronavirus-health-ministry-issues-reopening-schools/



182 రోజుల పని దినాలతో విద్యా సంవత్సరం
దసరా, సంక్రాంతి వంటి పండుగ సెలవులు, ఇతరత్రా సెలవు దినాలను కుదించింది.
ప్రవేశాల షెడ్యూల్‌ జారీ చేసిన తర్వాతే..కాలేజీలు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు.
ప్రవేశాల కోసం ఎలాంటి ప్రకటనలు జారీ చేయవద్దు.
ఈ నిబంధనలను అతి క్రమించిన కాలేజీల గుర్తింపును రద్దు చేస్తాం.