National survey: ఆ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణది చివరి స్థానం..

మహిళలు, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారానికి సంబంధించి భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యల్ప స్థానంలో ఉంది. ఈ విషయం నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే-5 ద్వారా వెల్లడైంది. తాజా నిర్వహించిన సర్వేలో...

National survey: ఆ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణది చివరి స్థానం..

Nutritious Food

National survey: మహిళలు, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారానికి సంబంధించి భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యల్ప స్థానంలో ఉంది. ఈ విషయం నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే-5 ద్వారా వెల్లడైంది. తాజా నిర్వహించిన సర్వేలో.. రాష్ట్రంలోని 6-23 నెలల మధ్య వయసు కలిగిన వారు తొమ్మిది శాతం మంది మాత్రమే కనీస పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారని సర్వే తెలిపింది. శిశువు, చిన్న పిల్లల ఆహార పద్దతులను అంచనా వేయడానికి డబ్ల్యూహెచ్ వో అనుమతి మేర ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వేలో భాగంగా పిల్లలకు తల్లి పాలు ఇస్తున్నారా? వారు తినే ఆహార సముహాల సంఖ్య, వారు తినే భోజనాల సంఖ్యను పరిగణలోకి తీసుకున్నారు.

NFH Survey: భారత్‌లో 30% మంది మహిళలకు శారీరక, లైంగిక హింస.. 80శాతం కేసుల్లో భర్తే నేరస్తుడట

ఈ సర్వే ప్రకారం.. 6-23 నెలల వయస్సులో ఉన్న 9శాతం మంది పిల్లలు కనీస పౌష్టికాహారాన్ని పొందలేక పోతున్నారు. 6-59 నెలల వయస్సులో 70శాతం మంది పిల్లలు రక్త హీనతలతో బధపడుతున్నారు. మహిళలల్లో 57శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. 17 కంటే తక్కువ ఉన్న 8.7శాతం మహిళలు సరియైన ఆహారం లేకపోవడంతో మధ్యస్తంగా, తీవ్రంగా సన్నగా ఉన్నారని సర్వే తెలిపింది. అయితే ఎస్ఎల్జీ ఆస్పత్రి చీఫ్ డైటీషియన్ డాక్టర్ బత్తుల అరుణ్ కుమార్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పౌష్టికాహారంలో ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు. పోషకమైన ఆహారం వారికి చాలా తరుచుగా మాంసాహార ఆహారంలో లభిస్తుందని తెలిపారు.