నల్లా కనెక్షన్లలో నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ

  • Edited By: madhu , August 21, 2020 / 01:45 PM IST
నల్లా కనెక్షన్లలో నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ

Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు.54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్ ద్వారా ప్రభుత్వం నీటి సరఫరా చేస్తోందని, ఇతర రాష్ట్రాలు దరిదాపుల్లో కూడా లేవని ఆయన వెల్లడించారు. ఈ విషయాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించిందని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మిషన్ భగీరథ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో 98.31% ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా నిలిచిపోయింది. రాష్ట్రంలో మొత్తం 54.38 లక్షల ఇళ్లు ఉండగా 53.46 లక్షల ఇళ్లకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తోంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు చెందిన జైజీవన్‌ మిషన్‌ 2020, ఆగస్టు 19వ తేదీ బుధవారం గణాంకాలు వెల్లడించింది.

నల్లాలతో తాగు నీరందించడంలో తెలంగాణ తర్వాత 89.05 శాతంతో గోవా రెండో స్థానం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 87.02తో మూడో స్థానం, 79.78 తో హర్యానా నాలుగో స్థానంలో నిలిస్తే..గుజరాత్‌ 74.16% ఐదో స్థానంలో నిలిచింది. 2.05 శాతంతో చివరి స్థానంలో పశ్చిమబెంగాల్‌ ఉంది.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే…34.71% ఇళ్లకు నల్లాల ద్వారా తాగు నీటిని అందిస్తోంది. ఏపీలో మొత్తం 95.66 లక్షల ఇళ్ల ఉంటే..33.21 నివాసాలకు నల్లా నీళ్లు అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత…తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు సీఎం కేసీఆర్. సురక్షితమైన మంచినీటిని

ప్రతి ఇంటికి అందివ్వాలనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ పథకం ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల అధికారులు తెలంగాణ రాష్ట్రానిక వచ్చి మిషన్ భగీరథ పని తీరును పరిశీలించి వెళుతున్నారు. దేశానికే ఆదర్శంగా నిలవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

Govt of India’s Ministry of Jal Shakti reports; Telangana is the leader with 98.31% tap connections providing potable drinking water under the pioneering #MissionBhagiratha ? Kudos to Hon’ble CM Sri KCR’s vision & diligent efforts of team RWS on this fabulous achievement ??

A post shared by KTR (@ktrtrs) on