Telangana : చికిత్స కోసం వస్తున్నారా..అనుమతి తప్పనిసరి

చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో హాస్పిటల్స్ ఉన్న బెడ్స్ దొరక్క పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Telangana : చికిత్స కోసం వస్తున్నారా..అనుమతి తప్పనిసరి

Tg corona

New Guidelines : కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. ఏపీలో ప్రతి రోజు 20 వేలకు మించి కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కరోనా రోగులు చికిత్స నిమిత్తం తెలంగాణలో వాలిపోతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ కు భారీగా తరలి వస్తున్నారు.

పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, తమిళనాడులో కేసులు విపరీతంగా ఉన్నాయి. చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో హాస్పిటల్స్ ఉన్న బెడ్స్ దొరక్క పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా హైదరాబాద్ కు వస్తే..కరోనా బాధితులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని వెల్లడించింది. ఆసుపత్రుల్లో బెడ్ దొరక్క అంబులెన్స్ లోనే ఉన్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో..బాధితుల సౌలభ్యం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ (040-2465119, 9494438351) ఏర్పాటు చేసింది.

కరోనా బాధితులు హైదరాబాద్ కు వస్తుండడంతో రెండు రోజుల క్రితం సరిహద్దులో పోలీసులు అంబులెన్స్ లను ఆపివేసిన సంగతి తెలిసిందే. చాలా మంది బాధితులు ఇబ్బందులు పడుతుండడంతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.