Janasena vs Posani: పోసాని ఇంటిపై రాళ్ళ దాడితో మాకు సంబంధం లేదు -తెలంగాణ జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ vs సీనియర్ నటుడు, ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి మధ్య నడుస్తున్న వివాదం ముదిరిపోయింది.

Janasena vs Posani: పోసాని ఇంటిపై రాళ్ళ దాడితో మాకు సంబంధం లేదు -తెలంగాణ జనసేన

Posani (1)

Janasena vs Posani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ vs సీనియర్ నటుడు, ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి మధ్య నడుస్తున్న వివాదం ముదిరిపోయింది. విమర్శలు, ప్రతి విమర్శలు మధ్య ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సర్కారుపై ఎలా కామెంట్లు చేస్తావంటూ పవన్‌పై పోసాని తీవ్ర విమర్శలు చేయగా.. ఆగ్రహించిన పవన్ అభిమానులు లేటెస్ట్‌గా పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు.

అమీర్‌పేట్‌కు సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై రాత్రి 2 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు రాళ్లు విసిరారు. పోసానిని బూతులు తిడుతూ రెచ్చిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే, పోసాని ఇంటిపై రాళ్ళ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది తెలంగాణ జనసేన. పవన్ కళ్యాణ్‌పై పోసాని వ్యాఖ్యల వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపించారు తెలంగాణ జనసేన ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్.

పోసానిపై మేం పెట్టిన కేసులు తీసుకోకపోవటంపై మాకు అనుమానాలు ఉన్నాయని, తెలంగాణ నుంచి పోసాని కృష్టమురళిని బహిష్కరించాలని, పవన్ కళ్యాణ్ తెల్లకాగితం లాంటి వాడని గతంలో పోసాని వ్యాఖ్యానించినట్లుగా చెప్పారు. 2009లో చిలకలూరిపేటలో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్‌ను బతిమాలి పోసాని తీసుకెళ్ళాడని పోసానిని కంట్రోల్ చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు.

పనికిరాని వ్యక్తికి మూడు వందల మంది పోలీస్ సెక్యూరిటీ అవసరమా? అని ప్రశ్నించారు. పోసానిపై వెంటనే కేసు నమోదు చేయకపోతే డిజీపీని కలుస్తామని స్పష్టం చేశారు నేమూరి శంకర్ గౌడ్.