Jawan Pabballa Anil : జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. తెలంగాణ జవాన్ మృతి

అనిల్ 10 ఏళ్ల క్రితం ఆర్మీ లో జాయిన్ అయినారు. 45 రోజుల లీవ్ పై స్వగ్రామానికి వచ్చాడు. సెలవులు ముగిశాక 10 రోజుల క్రితమే ఆర్మీకి వెళ్లారు.

Jawan Pabballa Anil : జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. తెలంగాణ జవాన్ మృతి

Jawan Pabballa Anil

Jawan Pabballa Anil : జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు హెలికాప్టర్ నదిలో పడింది. ఈ ప్రమాదంలో తెలంగాణ జవాన్ మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కపూర్ కి చెందిన పబ్బల్ల అనిల్ అనే టెక్నీషియన్ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుడికి భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు.. ఆయన్ (6) అరో (3) ఉన్నారు. అనిల్ 10 ఏళ్ల క్రితం ఆర్మీ లో జాయిన్ అయినారు. 45 రోజుల లీవ్ పై స్వగ్రామానికి వచ్చాడు. సెలవులు ముగిశాక 10 రోజుల క్రితమే ఆర్మీకి వెళ్లారు. ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

Road Accident : తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు మృతి

జవాన్ పబ్బ అనిల్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ కుమార్ అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కుటుంబ పెద్దను కోల్పోయి విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు యత్నించారు. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడుతూ అనిల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలన్నారు. అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.