Junior Doctors Telangana : జూడాల సమ్మె, వైద్య సేవలకు అంతరాయం

కరోనా వేళ జూనియర్‌ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మెలోకి వెళ్లారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో మెడికల్ కాలేజిల్లో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడింది.

Junior Doctors Telangana : జూడాల సమ్మె, వైద్య సేవలకు అంతరాయం

Telangana Junior Doctors Strike Medical Services Disrupted

Telangana Junior Doctors Strike : కరోనా వేళ జూనియర్‌ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మెలోకి వెళ్లారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో మెడికల్ కాలేజిల్లో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత నేపధ్యంలో కొవిడ్ యేతర సేవలకు సంబంధించిన వార్డుల్లోనూ రద్దీ కొనసాగుతోంది.

రోజు వారి అవుట్ పేషంట్ల విభాగాలు సైతం కిటకిటలాడుతున్నాయి. జూనియర్ డాక్టర్లు సమ్మెతో గందరగోళం ఏర్పడింది. రెండురోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 28 నుంచి అన్ని రకాల విధులు బహిష్కరించనున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. రాష్ర్టంలో దాదాపు ఆరు వేల మంది జూనియర్ డాక్టర్లు, మరో వెయ్యి మంది వరకు సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు.

డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న రాష్ర్ట వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు. 15 రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం స్పష్టం చేసింది.

సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రి సందర్శించిన సందర్బంలోనూ జూడాల సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తామని చెప్పారని జూడా ప్రతినిధులు చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సంబంధిత ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్, సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది వైద్య ఆరోగ్యశాఖ.

కొవిడ్, ఇతర వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్తగా డ్యూటీ రోస్టర్ రూపొందించాలను స్పష్టం చేసింది. కరోనా సమయంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదన్నారు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి. బాధితులంతా వైద్యం కోసం వస్తున్న సమయంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని సూచించారు.

Read More : Drive-Through Vaccine Centre : ఢిల్లీలో డ్రైవ్-థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం..వ్యాక్సిన్ల సరఫరాకు స్పుత్నిక్‌ వీ అంగీకారించిందన్న కేజ్రీవాల్