Cm KCR : ప్రజల భూములు, ఆస్తుల ర‌క్ష‌ణ కోసమే డిజిట‌ల్ స‌ర్వే

ప్రజల భూములకు ఆస్తులకు రక్షణ కల్పించేందుకే డిజిట‌ల్ స‌ర్వే చేప‌డుతున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.ప్రగతి భవన్‌లో ఈరోజు సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్తు తరాలకు భూ తగాదాలు లేకుండా చేయాలని దీని కోసం శాశ్వతంగా పరిష్కారం చూపాలనే సదుద్దేశ్యంతోనే ఈ డిజిటల్ సర్వే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

Cm KCR : ప్రజల భూములు, ఆస్తుల ర‌క్ష‌ణ కోసమే డిజిట‌ల్ స‌ర్వే

Cm Kcr

Telangana lands digital survey : ప్రజల భూములకు ఆస్తులకు రక్షణ కల్పించేందుకే డిజిట‌ల్ స‌ర్వే చేప‌డుతున్నామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.ప్రగతి భవన్‌లో ఈరోజు సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్తు తరాలకు భూ తగాదాలు లేకుండా చేయాలని దీని కోసం శాశ్వతంగా పరిష్కారం చూపాలనే సదుద్దేశ్యంతోనే ఈ డిజిటల్ సర్వే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పాత కాలపు విషయాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఎన్నో వేల ఏళ్లనుంచి కొనసాగుతున్న భూపరిపాలనలో గుణాత్మక మార్పులు రోజు రోజుకూ చోటుచేసుకుంటున్నాయని..తెలిపారు.మనిషి ఆదిమానవుడుగా ఉణ్న సమయంలో బతుకటానికే పోరాటం చేసేవాడు. అప్పుడు మనిషికి భూమిమీద హక్కులు లేవు. ఇది నీది ఇది నాది అనే తేడాలు లేవు. కలిసి కట్టుగా కష్టపడి జీవించేవాడు. ఆ తరువాత కొన్ని ఏళ్లకు మనిషి వ్యవసాయం చేయటం నేర్చుకున్నాడు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల్లోనే భూమి మీద హక్కు ప్రారంభమైందని తెలిపారు.

ఆ తరువాత రాజుల కాలం నుంచి ప్రస్తుత ప్రజాస్వామిక సమాజం వరకూ భూమి హక్కుల ప్రక్రియలో అనేకానేక మార్పులు చోటుచేసుకున్నాయి. అలా పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మారుతున్న కాలంలో ప్రభుత్వాలు కూడా ప్రజల భూములు ఆస్తుల రక్షణ విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వుండాలని సూచించారు. రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజల భూములకు.. ఆస్తులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తోందని..ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించి ఈ డిజిటల్ ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. ఈ మంచి ఉద్దేశ్యాన్ని లక్ష్యాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకోవాలని సీఎం కేసీఆర్ స‌ర్వే ప్ర‌తినిధుల‌కు వివరించారు.