Telangana LockDown : తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

తెలంగాణలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించింది తెలంగాణ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలను సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది.

Telangana LockDown : తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

Telangana Lockdown

Telangana LockDown Relaxed : తెలంగాణలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించింది తెలంగాణ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలను సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది. రాష్ట్రంలో కర్ఫ్యూను పక్కాగా అమలు చేయనుంది. మంగళవారం (జూన్ 8)న కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓ గంట పాటు ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. ఎల్లుండి నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

ఖమ్మం, మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించగా.. నకిరేకల్ మినహా నల్గొండ జిల్లా మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.  కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లిలో లాక్ డౌన్ కొనసాగనుంది. ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులు వర్తిస్తాయి. అలాగే నకిరేకల్ మినహా నల్లగొండ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు అమల్లో ఉంటాయి. ఈ నెల 10 నుంచి లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి రానున్నాయి.

తెలంగాణలో మే 12 నుంచి 20 గంటల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్‌ వేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచే లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే సడలింపులతో అనుమతినిచ్చింది. 2021, మే 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్‌డౌన్‌లో మరికొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది సర్కార్‌.

లాక్‌డౌన్‌ సడలింపు సమయాన్ని కూడా పెంచింది. మరో మూడు గంటలు సడలింపు సయమాన్ని పెంచింది. దీని ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్‌ నుంచి అన్నింటికి మినహాయింపు ఇచ్చింది. మరో గంట అదనపు సమయాన్ని ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్లకు చేరుకోవడానికి వీలుకల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. మొదటిసారి లాక్ డౌన్ విధించినప్పుడు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అంటే 20 గంటలు లాక్ డౌన్ అమల్లో ఉంది. నిత్యావసర కార్యకలాపాలకు ప్రభుత్వం 4(ఉదయం 6 నుంచి 10 వరకు) గంటలు వెసులుబాటు కల్పించింది.