తెలంగాణలో కొత్తగా 205 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 205 కరోనా కేసులు

telangana:కరోనా కారణంగా కంటి మీద కునుకు లేకుండా బతికిన ప్రజలకు కాస్త ఉపశమనం దొరికినట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజుల్లో మొదలు కాబోతుండగా.. లేటెస్ట్‌గా రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా మహమ్మారి నుంచి 551 మంది బాధితులు బయటపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,068కి చేరుకోగా.. 2,77,304 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6231 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. అందులో 4,136 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత 24 గంటల్లో కరోనా వల్ల ఇద్దరు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1533కు చేరుకుంది.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.27 శాతంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 27వేల 244 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో డిసెంబర్‌ 27వ తేదీ వరకు 67,50,954 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 54 కేసులు నమోదయ్యాయి.