Home with Tree : ఇంటి మధ్యలో ఇప్ప చెట్టు..వృక్షం కోసం డిజైన్‌ను మార్చి కట్టిన హరిత ప్రేమికుడు

ఇల్లు కట్టుకోవటానికి ఓ చెట్టు అడ్డు వచ్చింది. కానీ ఆ చెట్టుని నరకకుండా ఇల్లు కట్టాడు ఓ హరిత ప్రేమికుడు. ఇంటిలో ఇప్పచెట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Home with Tree : ఇంటి మధ్యలో ఇప్ప చెట్టు..వృక్షం కోసం డిజైన్‌ను మార్చి కట్టిన హరిత ప్రేమికుడు

Telangana Man Built Home Without Cutting Tree (1)

Telangana Man built home without cutting tree : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. సమస్త ప్రాణులకు ప్రాణాధారం. ఆక్సిజన్ ను ఇచ్చే ప్రకృతి బిడ్డలు. దారికి అడ్డమొస్తే భారీ వృక్షాలను కూడా నరికిపారేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం చెట్టు కోసం తన ఇంటి డిజైన్ నే మార్చుకుని కట్టుకున్నారు. ఆ ఇంటిని చూస్తే ఇంటిలో చెట్టుందా? చెట్టులో ఇల్లుందా? అనిపిస్తుంది. ఇంటిలో ఇప్ప చెట్టు భలే ఆకట్టుకుంటోంది. ఆ ఇంటి యజమాని చెట్టుకు ఇచ్చిన విలువ ప్రతీ ఒక్కరు ఇస్తే ప్రాణవాయువుకు కొరత ఏంటుంది?

చెట్ల‌ను న‌రుక్కుంటూ పోవటంతో అడవులకు అడవులే తరిగిపోతున్నాయి. పర్యావరణ తీవ్రంగా దెబ్బతింటోంది. గృహ నిర్మాణాల‌కు చెట్లు అడ్డంగా ఉంటే ఏ మాత్రం ఆలోచించ‌కుండా వాటిని న‌రికేస్తుంటారు. కానీ.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌ కు చెందిన ఆర్యన్‌ మహారాజ్‌ అనే వ్యక్తి మాత్రం త‌న స్థ‌లంలోని భారీ చెట్టుని న‌ర‌క‌కుండానే ఇల్లు క‌ట్టుకుని ఆద‌ర్శంగా నిలిచారు. మనం కూడా ఇలా చేద్దాం అనిపిస్తున్నారు.

చెట్టు కోసం ఇంటి డిజైన్‌ను మార్చేసుకుని ఇంటిని క‌ట్టుకున్నారు ఆర్యన్. కొన్ని నెలల క్రితం ఇంటి నిర్మాణం చేప‌ట్టారు ఆర్యన్. అది ఇటీవలే పూర్తి అయ్యింది. త‌న‌ స్థలంలోని ఓ ఇప్ప చెట్టు సరిగ్గా ఇంటి మధ్యలోకి వస్తుండటంతో ఏం చేయాలా? అని ఆలోచించారు. కానీ ఇంటి కోసం చెట్టుని నరకటానికి ఆయనకు అస్సలు మనస్సు ఒప్పలేదు. దాంతో ఇంటి ఆకృతిని మార్పు చేసి..చెట్టును కొట్టేయ‌కుండా అలాగే ఉంచి మిద్దెమీదికి వెళ్లేందుకు వీలుగా ఓ చిన్నగదిని నిర్మించుకున్నారు.

కాంక్రీటు వల్ల చెట్టు ఎదగదనే ముందస్తు జాగ్రత్తగా ఆర్యన్ ప్రకృతికి ప్రకృతే అండ అన్నట్లుగా.. వెదురుబొంగులు, చెక్కలు, పెంకులతో గది పైకప్పును వేయించారు.ఈ ఇప్పచెట్టులో ఇల్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ మారాయి.