యూఏఈ IPL పోరులో మ్యాచ్ స్కోరర్‌గా తెలంగాణ బిడ్డ..

  • Published By: sreehari ,Published On : November 7, 2020 / 01:41 PM IST
యూఏఈ IPL పోరులో మ్యాచ్ స్కోరర్‌గా తెలంగాణ బిడ్డ..

Telangana man Prasanth Kumar : యూఏఈలో ఉత్కంఠభరింతగా జరుగుతున్న 2020 ఐపీఎల్ టోర్నీలో తెలంగాణ బిడ్డ స్కోరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అతడే.. జనగాంకు చెందిన క్రికెట్ ఔత్సాహికుడు ప్రశాంత్ కుమార్.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రధాన స్కోరర్ గా పనిచేస్తున్నాడు. తాను దివ్యాంగి అయినప్పటికీ క్రికెట్‌ పట్ల ఇష్టాన్ని చంపుకోలేదు.



తన వైకల్యాన్ని ఎంతమాత్రం లెక్క చేయలేదు.. చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నాడు. అదే ఉత్సాహంతో ముందుకు సాగాడు. తన ఒక్క ఎడమ చేతితోనే లైఫ్ లీడ్ చేశాడు.

యూఏఈలో జరిగే ఐపీఎల్ టోర్నీలో మ్యానువల్ స్కోరుబోర్డును నోట్ చేయగల స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో స్కోరు బోర్డును నోట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు.
Telangana man in thick of IPL action in UAEక్రికెట్ అంటే నాకెంతో ఇష్టం. స్కూల్, కాలేజీ లైఫ్‌లోనే క్రికెట్ ఆడేవాడిని. నా ఎడమచేతితో బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేయగలను. పీవీపీ సిద్ధార్థ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను.

ఆ తర్వాత దుబాయ్ లోని యోగి గ్రూప్ ఆఫ్ కన్ స్ట్రక్చన్స్ లో ఉద్యోగం సంపాదించాను. 2005లో జరిగిన లోకల్ క్రికెట్ మ్యాచ్‌ల్లో స్కోరు నోట్ చేసుకునే ఉద్యోగంలో చేరాను.



స్కోరర్ గా అక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది’ అంటూ 39ఏళ్ల ప్రశాంత్ తన జీవత ప్రయాణాన్ని చిట్ చాటలో వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన యజమాని అయిన దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ కన్వీనర్, శివ పగరాణి నుంచి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చాడు. అలా తన క్రికెట్ కలను నెరవేర్చుకున్నానని తెలిపాడు.



2009లో దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ తో స్కోరర్‌గా ప్రశాంత్ తన కెరీర్ ప్రారంభించాడు.
https://10tv.in/we-are-confident-ms-dhoni-will-lead-csk-in-2021-kasi-viswanathan/
యూఏఈలో జరిగే అన్ని దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్ లకు స్కోరర్ గా వ్యవహరించాడు. ఇప్పుడు యోగి గ్రూపు ఆఫ్ కంపెనీలకు అసిస్టెంట్ డివిజన్ మేనేజర్ కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు.



ఓర్పుతో ఎలా ఉండాలో క్రికెట్ మ్యాచ్ స్కోర్లే తనకు నేర్పించాయని చెప్పాడు. టన్నుల కొద్ది సహనంతో పాటు ఖచ్చితత్వం కూడా తప్పక ఉండాలని అంటున్నాడు. ప్రతి బంతికి బ్యాట్స్ మెన్ మాదిరిగానే ఏకాగ్రతతో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని తన అనుభవాలను చెప్పుకొచ్చాడు.